ర్యాగింగ్ జరిగింది వాస్తవమే.. ఎంసీఏకి ర్యాగింగ్ కమిటీ నివేదిక

డాక్టర్ ప్రీతిని హరాస్మెంట్ చేసింది వాస్తవం ఆదేశాలను బట్టి తదుపరి చర్యలు కేఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గతంలో రెండు, మూడు సార్లు పీజీ సీనియర్ మెడికో డాక్టర్ సైఫ్, పీజీ మెడికో డాక్టర్ ప్రీతిని వేధించినట్లు నిర్ధారణ అయినట్లు కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ (NMC) ఆదేశాల మేరకు కాకతీయ మెడికల్ కళాశాలలో బుధవారం ఆంటీ ర్యాగింగ్ సమావేశం […]

  • Publish Date - March 1, 2023 / 02:30 PM IST

  • డాక్టర్ ప్రీతిని హరాస్మెంట్ చేసింది వాస్తవం
  • ఆదేశాలను బట్టి తదుపరి చర్యలు
  • కేఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గతంలో రెండు, మూడు సార్లు పీజీ సీనియర్ మెడికో డాక్టర్ సైఫ్, పీజీ మెడికో డాక్టర్ ప్రీతిని వేధించినట్లు నిర్ధారణ అయినట్లు కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ (NMC) ఆదేశాల మేరకు కాకతీయ మెడికల్ కళాశాలలో బుధవారం ఆంటీ ర్యాగింగ్ సమావేశం నిర్వహించారు. మంగళవారం జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో బుధవారం నిర్వహించారు.

ఈ సమావేశంలో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య, డాక్టర్ సైఫ్ వేధింపులకు గురిచేశారా లేదా? దీనిపై కాలేజీ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న చర్యలు తదితర అన్ని అంశాలను పరిశీలించారు. తదుపరి సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశం మధ్యలో కాలేజ్ అనస్తీసియా హెచ్ ఓ డి నాగార్జున రెడ్డిని పిలిచి విషయాలు తెలుసుకున్నారు. సైఫ్‌ను ప్రీతిని విడివిడిగా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు, కౌన్సిలింగ్లో ఇద్దరు మేల్ ప్రొఫెసర్లు, ఇద్దరు ఫిమేల్ ప్రొఫెసర్ ఉన్నారు. ఈ సమావేశంలో ర్యాగింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.

శారీరక వేధింపులు జరగలేదు

ప్రీతి ఆత్మహత్య సంఘటనలో శారీరకంగా వేధించిన ఘటనలు ఎక్కడ జరగలేదని ప్రిన్సిపల్ వెల్లడించారు. ఆంటి ర్యాగింగ్ రూల్స్ ప్రకారం మానసికంగా వేధించడం ర్యాగింగ్ గా భావిస్తున్నామన్నారు. ప్రీతిని, సైఫ్ ర్యాగింగ్ చేయడం నిర్దారణ అయ్యిందన్నారు.

ఈ నివేదికను నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఢిల్లీకి, NMCకి సైతం గురువారం పంపుతున్నామని చెప్పారు. ఎంసీఏ తీసుకునే నిర్ణయాలు బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఉత్కంఠభరితంగా సాగిన ర్యాగింగ్ కమిటీ సమావేశంలో 14 మంది కమిటీ సభ్యులలో 13 మంది హాజరయ్యారు. KMCకి గవర్నర్ ఎలాంటి లేఖ పంపలేదని ప్రిన్సిపల్ మోహన్ దాస్ చెప్పారు.

Latest News