Renu Desai | నా విషయంలో తప్ప.. మా ఆయన మంచోడే.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: రేణుదేశాయ్

Renu Desai | విధాత‌: సాధారణంగా రాజకీయాల గురించి ఎన్నడూ మాట్లాడని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇప్పుడు లైన్లోకి వచ్చారు. పవన్ కు మద్దతుగా మాట్లాడుతూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. తన విషయంలో… తనను పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం వంటి విషయాల్లో పవన్ చేసింది తప్పేనని చెప్పిన రేణూదేశాయ్ రాజకీయంగా మాత్రం తన మద్దతు పవన్ కే అన్నారు. పవన్ డబ్బు మనిషి కాదని.. సమాజం, పేదలకు మంచి చేయాలనుకుంటారని, అందుకోసమే […]

  • Publish Date - August 10, 2023 / 12:47 PM IST

Renu Desai |

విధాత‌: సాధారణంగా రాజకీయాల గురించి ఎన్నడూ మాట్లాడని పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇప్పుడు లైన్లోకి వచ్చారు. పవన్ కు మద్దతుగా మాట్లాడుతూ ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. తన విషయంలో… తనను పెళ్లి చేసుకోవడం, విడాకులు ఇవ్వడం వంటి విషయాల్లో పవన్ చేసింది తప్పేనని చెప్పిన రేణూదేశాయ్ రాజకీయంగా మాత్రం తన మద్దతు పవన్ కే అన్నారు.

పవన్ డబ్బు మనిషి కాదని.. సమాజం, పేదలకు మంచి చేయాలనుకుంటారని, అందుకోసమే కుటుంబాన్ని సైతం పక్కనబెట్టారని అన్నారు. మూడు పెళ్లిళ్లపై చర్చ ఆపాలని, పిల్లలను, కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. ఇన్నాళ్లూ పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడి ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న రేణూదేశాయ్ ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చి పాజిటివ్ గా మాట్లాడారు.

“ఆయన సక్సెస్ ఫుల్ హీరో. కావాలంటే సినిమాల్లో కొనసాగవచ్చు. కావాల్సినంత క్రేజ్, డబ్బు వస్తుంది. కానీ ఆయన రాజకీయాలు ఎంచుకున్నాడు. కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టాడు. ఆయన దగ్గర నేను లేకపోయినా, ఆయన్ను గమనిస్తూనే ఉన్నాను.

ఆయన రాజకీయంగా నిజాయితీగా ఉన్నారు. చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ చెబుతున్నాను, ఆయనకు ఓ అవకాశం ఇవ్వండి. నేను ఆయన మాజీ భార్యగా చెప్పడం లేదు, సమాజానికి చెందిన ఓ పౌరురాలిగా చెబుతున్నాను.”

పవన్ వల్ల వ్యక్తిగతంగా తను చాలా నష్టపోయానని, 11 ఏళ్లు ఆ బాధను అనుభవించానని చెప్పారు. తానూ మర్చిపోయినట్లే మిగతావాళ్లు కూడా పవన్ 3 పెళ్లిళ్ల వ్యవహారాన్ని వదిలేయాలని రేణు కోరారు. మొత్తానికి హఠాత్తుగా ఆమె ఇలా బయటికి వచ్చి పవన్ కు మద్దతుగా ఎందుకు మాట్లాడారో అని పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.