తొర్రూరు మసీదులో గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్క‌రించిన మంత్రి ఎర్రబెల్లి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సాధారణంగా స్వాతంత్య్ర‌, రిపబ్లిక్ డే దినోత్సవం తదితర జాతీయ పండుగల సందర్భంగా పతాకావిష్కరణ చేయడం పరిపాటి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ సెంటర్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సంబరాలు జరుపుకోవడం సంప్రదాయం. తాజాగా రిపబ్లిక్ డే పురస్కరించుకొని గురువారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరులో మైనారిటీల ప్రార్థనాలయం మసీదులో ముస్లిం మైనారిటీలు ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల […]

  • Publish Date - January 26, 2023 / 11:28 AM IST
  • జాతీయ జెండాను ఆవిష్క‌రించిన మంత్రి ఎర్రబెల్లి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సాధారణంగా స్వాతంత్య్ర‌, రిపబ్లిక్ డే దినోత్సవం తదితర జాతీయ పండుగల సందర్భంగా పతాకావిష్కరణ చేయడం పరిపాటి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వివిధ సెంటర్లలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సంబరాలు జరుపుకోవడం సంప్రదాయం.

తాజాగా రిపబ్లిక్ డే పురస్కరించుకొని గురువారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరులో మైనారిటీల ప్రార్థనాలయం మసీదులో ముస్లిం మైనారిటీలు ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. మైనారిటీలు ఈ సందర్భంగా గణతంత్ర సంబురాలు జరుపుకున్నారు. అనంత‌రం దయాకర్ రావు గాంధీజీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు.

త‌ద‌నంత‌రం మంత్రి మాట్లాడారు. మహనీయుల త్యాగాలను మరువద్దు. స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాల ఫలితమే నేటి స్వతంత్య్రం, గణతంత్రమన్నారు. అంబేడ్కర్ రాసిన మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద దనీ, దేశం సర్వ సత్తాక, సామ్యవాద, ప్రజాస్వామిక, లౌకిక, సమైక్యతకు, సౌభ్రాతృత్వానికి కట్టుబడి ఉన్నామని చాటే రోజని చెప్పారు.

దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమాన అవకాశాల్ని అందించడానికి పునరంకితం అయ్యే రోజుగా అభివర్ణించారు. రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు. ప్రజాస్వామ్యమే ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పుర ప్రముఖులు, ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.