Site icon vidhaatha

Revanth Reddy | రేవంత్‌రెడ్డి భద్రతకు.. డుమ్మా కొట్టిన గన్‌మెన్లు

Revanth Reddy |

విధాత: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి భద్రతకు నియమించిన గన్‌మెన్లు విధులకు డుమ్మా కొట్టడం సంచలనంగా మారింది. ఆయనకు గతంలో 4+4గన్‌మెన్ల సెక్యురిటీ ఉండగా ఇటీవల 2+2కు ప్రభుత్వం కుదించింది. బుధవారం నుంచి భద్రత సిబ్బంది విధులకు డుమ్మా కొట్టారు.

రెండు నెలల క్రితం తనకు సెక్యురిటీ కావాలంటు హైకోర్టులో రేవంత్ పిటిషన్ వేశారు. ప్రభుత్వం రేవంత్‌కు 69 మందితో భద్రత కల్పిస్తున్నట్లుగా పేర్కోంది. అనంతరం రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించిన ప్రభుత్వం తదుపరి కుదించింది.

ఇటీవల రేవంత్ రెడ్డి పోలీసు అధికారుల తీరుపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై పలు స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు చేశారు. రాచకొండ సీపీ ఆధ్వర్యంలో రేవంత్‌కు 2+2 గన్‌మెన్ల భద్రత గత మంగళవారం వరకు కొనసాగింది.

పోలీసులను గుడ్డలూడదీసి కొడుతామన్న రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తు గనమెన్లు విధులకు హాజరు కావడానికి నిరాకరించారని పోలీసు వర్గాల కథనం. రేవంత్‌కు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ పార్టీ పేర్కోంది. మరోవైపు తనకు సెక్యురిటీ లేకుండానే రేవంత్ రెడ్డి ప్రజల్లో తన రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

Exit mobile version