Site icon vidhaatha

Revanth Reddy | MLC పదవైనా ఇస్తాడ‌నుకున్నా! రేవంత్ రెడ్డి ట్వీట్‌ వైర‌ల్‌

Revanth Reddy

విధాత: అమ‌రుల కుటుంబాల‌కు ఒక్క ఎమ్మెల్సీ ప‌ద‌వైనా ప్ర‌క‌టిస్తాడేమోన‌ని తెలంగాణ ఆశించందంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింంది.

గురువారం అమ‌రుల స్మార‌క చిహ్నం ప్రారంభం సంద‌ర్భంగా మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మంలో తొలి అమ‌రుడైన శ్రీకాంత‌చారి త‌ల్లి శంక‌ర‌మ్మ‌కు ఎమ్మెల్సీ అంటూ ప‌లు ప‌త్రిక‌ల‌లో వార్త‌లు రావ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ప్ర‌చారం జోరుగా సాగింది.

కానీ సీఎం కేసీఆర్ నుంచి ఎమ్మెల్సీకి సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ క్ర‌మంలోనే అమ‌రుల స్మార‌క చిహ్నం ప్రారంభం సంద‌ర్భంగా జ‌రిగిన అంశాల‌ను జోడిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రేవంత్ ట్వీట్‌లో.. ఈవిధంగా ఉంది.

“అమరవీరులకు కేసీఆర్ నివాళిలో అడుగడుగునా కృత్రిమ భావన కనిపించింది. ఆ కుటుంబాలకు సత్కారాల నుండి ఎలక్ట్రానిక్ కొవ్వొత్తుల ప్రదర్శన వరకు నిజాయితీ కొరవడింది. ఎందరో ద్రోహులను అందలం ఎక్కించిన కేసీఆర్ నిన్న అమరవీరుల కుటుంబాల కోసం ఒక్క ఎమ్మెల్సీ పదవైనా ప్రకటిస్తాడేమోనని తెలంగాణ ఆశించింది.”

Exit mobile version