Site icon vidhaatha

Rohit Sharma: అభిమానికి రోహిత్ శర్మ రూ.4కోట్ల కారు గిఫ్టు!

Rohit Sharma:  టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానికి ఇచ్చిన మాట నిలుపుకుని అందరిని సర్ ప్రైజ్ చేశాడు. డ్రీమ్ 11 పోటీలో విజేతగా నిలిచిన అభిమానికి రూ.4 కోట్లు విలువ చేసే తన సొంత నీలిరంగు లంబోర్గి కారును గిఫ్ట్ గా ఇచ్చిన రోహిత్ శర్మ తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. రోహిత శర్మ విజేతకు కారు కీలను అందించి..అతడి కుటుంబ సభ్యులతో హుషారుగా ఫోటోలు దిగారు. ఆ కారు కీ పై ఆర్ఎస్ 264 అని రాసి ఉండటం ఆసక్తి రేపింది. రోహిత్ శర్మ కోల్ కతా ఈడెన్ గార్డులో 2014లో శ్రీలంకపై సాధించిన తన వన్డే అత్యధిక స్కోర్ ఇన్నింగ్స్ ను గుర్తు చేసేలా ఆ కారు కీపై ముద్రించి ఉండటం విశేషం.

రోహిత్ శర్మ తన అభిమానులకు విలువైన కానుకను అందించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హిట్ మ్యాన్ హార్ట్ మ్యాన్ అని చాటుకున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల టీ 20లకు, టెస్టు క్రికెట్ ఫార్మెట్ కు వీడ్కోలు చెప్పిన రోహిత్ శర్మ భారత క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇటీవల అతని ఘనతకు గుర్తింపుగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ముంబై వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్ కు రోహిత్ శర్మ స్టాండ్ గా నామకరణం చేసి గౌరవించడం విశేషం.

https://x.com/rohann__45/status/1924409087078404285

Exit mobile version