బస్వాపురం నిర్వాసితులకు రూ.46.35కోట్లు మంజూరు

ఎమ్మెల్యే శేఖ‌ర్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన నిర్వాసితులు విధాత: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్ భూనిర్వాసితులకు రూ.46.35కోట్ల పరిహార, పునరావాస నిధులను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మంజూరు చేయించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బుధ‌వారం కలిసిన శేఖర్ రెడ్డి బస్వాపురం రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు ఆర్ &ఆర్ ప్యాకేజీ కింద పరిహారం కోసం 33.45 కోట్లు, పునరావాస కేంద్ర లేఅవుట్ అభివృద్ధికి […]

  • Publish Date - January 25, 2023 / 03:09 PM IST
  • ఎమ్మెల్యే శేఖ‌ర్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన నిర్వాసితులు

విధాత: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం రిజర్వాయర్ భూనిర్వాసితులకు రూ.46.35కోట్ల పరిహార, పునరావాస నిధులను స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మంజూరు చేయించారు.

హైదరాబాద్ ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బుధ‌వారం కలిసిన శేఖర్ రెడ్డి బస్వాపురం రిజర్వాయర్ ముంపు నిర్వాసితులకు ఆర్ &ఆర్ ప్యాకేజీ కింద పరిహారం కోసం 33.45 కోట్లు, పునరావాస కేంద్ర లేఅవుట్ అభివృద్ధికి 12.90 కోట్లు మొత్తం 46.35 కోట్ల రూపాయలను మంజూరు చేయించారు.

బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధిత కుటుంబాలకు నష్టపరిహార డబ్బులు, పునరావాస కేంద్రం లేఔట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు, కృషి చేసిన ఎమ్మెల్యే శేఖర్ రెడ్డికి బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, B.N తిమ్మాపురం ఎంపీటీసీ ఉడత శారద ఆంజనేయులు యాదవ్, B.Nతిమ్మాపురం పాల సంఘం చైర్మన్ జిన్నా నరసింహ, BRS గ్రామ శాఖ అధ్యక్షులు డొంకేన ప్రభాకర్, స్థానిక నాయకులు, నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు