Sajjanar | వేసవిలో లహరితో చిల్‌.. లహరి బస్సు ప్రయాణపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

వేసవిలో చల్లదనం అందించే టీఎస్ ఆర్టీసీ లహరి ఎసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకుని చిల్‌ కావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచించారు

  • Publish Date - April 18, 2024 / 04:50 PM IST

విధాత: వేసవిలో చల్లదనం అందించే టీఎస్ ఆర్టీసీ లహరి ఎసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకుని చిల్‌ కావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సూచించారు. హైటెక్ హంగులతో రూపొందించిన లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను అర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిందని సజ్జనార్‌ ట్విటర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. లహరి బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, అదిలాబాద్, నిజామాబాద్, నాగ్ పూర్, షిరిడీ, సత్తుపల్లి, తదితర మార్గాల్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. లహరి-అమ్మఒడి అనుభూతి పేరుతో రూపొందించబడిన లహరి సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. మరోవైపు వరంగల్ నుంచి నిజమాబాద్ రూట్‌లలో కూడా ఈ ఏసీ సర్వీసులు నడిపించాలంటూ నెటిజన్లు కోరారు.

Latest News