Rushikonda Beach | రుషికొండ బీచ్ కు టికెట్.. వ్యతిరేకిస్తున్న ప్రజలు

Rushikonda Beach విధాత‌: సముద్రాన్ని… కొండలను.. నదులను చూడ్డానికి టికెట్ ఏమిటా అనుకుంటున్నారా ? అదంతే .. విశాఖలోని ప్రఖ్యాత రుషికొండ బీచ్ లోనికి ఇకనుంచి ఎంట్రీ టికెట్ కట్టాలి.. పిల్లలకు టికెట్ లేదు కానీ పెద్దలకు రూ. 20 చొప్పున టికెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీన్ని పౌరసమాజం వ్యతిరేకిస్తోంది. విశాఖ పట్టణం పుట్టినప్పటినుంచి ఈ రుషికొండ బీచ్ ఉంది కానీ ఎన్నడూ ఏ ప్రభుత్వానికి రాని ఆలోచనలు ఈ ప్రభుత్వానికి వస్తున్నాయి… ఆఖరుకు సముద్రాన్ని చూడడానికి […]

  • Publish Date - July 9, 2023 / 06:04 AM IST

Rushikonda Beach

విధాత‌: సముద్రాన్ని… కొండలను.. నదులను చూడ్డానికి టికెట్ ఏమిటా అనుకుంటున్నారా ? అదంతే .. విశాఖలోని ప్రఖ్యాత రుషికొండ బీచ్ లోనికి ఇకనుంచి ఎంట్రీ టికెట్ కట్టాలి.. పిల్లలకు టికెట్ లేదు కానీ పెద్దలకు రూ. 20 చొప్పున టికెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దీన్ని పౌరసమాజం వ్యతిరేకిస్తోంది. విశాఖ పట్టణం పుట్టినప్పటినుంచి ఈ రుషికొండ బీచ్ ఉంది కానీ ఎన్నడూ ఏ ప్రభుత్వానికి రాని ఆలోచనలు ఈ ప్రభుత్వానికి వస్తున్నాయి… ఆఖరుకు సముద్రాన్ని చూడడానికి సైతం టికెట్ పెట్టడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే విశాఖ సాగర తీరేనా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసి, పర్యాటకులను ఆకర్షించేందుకు కొంత భాగాన్ని ఓ ప్రయివేటు సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు మద్రాస్ లో సైతం మెరీనా బీచ్ లో ఎంట్రీ టికెట్ ఉందని, ఇది పాతికేళ్ల నుంచే ఉందని, ఇప్పుడు విశాఖలో రుషికొండ బీచ్ కు టికెట్ విధానం ఉంది కదా అని ప్రభుత్వ వర్గాలు అంటున్నా విశాఖలో సైతం ఇలా టికెట్ పెట్టి బీచ్ లోకి వెళ్ళాలి అంటే సాధారణ మధ్యతరగతి వాళ్ళల్లో భరించలేని ఖర్చు అవుతుంది అని ఆవేదన వ్యక్తం అవుతోంది.

ఒక కుటుంబం రుషికొండ బీచ్ కు వెళ్ళాలి అంటే దాదాపు నలుగురికి రూ.80 కట్టాలి. రుషికొండ బీచ్ కు సాధారణ రోజుల్లో దాదాపు ఐదు వేలమంది వస్తారు. వీకెండ్స్ లో దాదాపు పదిహేనువేలమంది వస్తారు. ఈ టికెట్ విధానం 11 వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది.