Site icon vidhaatha

Sabitham Falls | జలపాతాలు.. మృత్యు పాశాలు

Sabitham Falls

విధాత, కరీంనగర్ బ్యూరో: వర్షాకాలంలో జాలువారే జలపాతాల అందాలు తనివితీరా వీక్షించేందుకు వస్తున్న యువత తగు జాగ్రత్తలు పాటించకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో, పెద్దపల్లి జిల్లా సబితం వద్ద జలపాతాలు ఉన్నాయి. ఈ రెండు జలపాతాల వద్ద సరైన రక్షణ చర్యలు లేవు.

బుధవారం విద్యాసంస్థలకు సెలవు కావడంతో మిత్రులతో కలిసి సంతోషంగా గడిపేందుకు సబితం జలపాతం వద్దకు వచ్చిన ఓ యువకుడు మృత్యువాత పడ్డారు.

కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన మానుపాటి వెంకటేష్ అనే యువకుడు మరో ముగ్గురు మిత్రులతో కలిసి సబితం జలపాతం వద్ద సంతోషంగా గడుపుతున్న క్షణాల్లోనే అనుకోని దుర్ఘటనతో జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

గతంలోనూ ఈ జలపాతం వద్ద ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. జలపాతాల వద్ద రక్షణ చర్యలు లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు వినవస్తున్నాయి. అధికారులు జలపాతాల వద్ద ప్రాణ నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు, పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.

Exit mobile version