బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన నూతన చిత్రం సికందర్ (Sikandar). తమిళ అగ్ర దర్శకుడు మురగదాస్ (A.R. Murugadoss) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తోండగా అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలా (Sajid Nadiadwala) నిర్మించారు.
రష్మిక మందన్నా (Rashmika Mandanna) కథానాయికగా నటించింది. సత్యరాజ్ (Sathyaraj) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా రంజాన్ పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈచిత్రం టీజర్ రిలీజ్ చేశారు.