Site icon vidhaatha

SBI | ఎస్‌బీఐ డిపాజిటర్లకు గుడ్‌న్యూస్‌..! అమృత కలశ్‌ స్కీమ్‌ గడువు పొడిగింపు..!

SBI |

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. అమృత కలశ్‌ స్కీమ్‌ను పొడిగించింది. డిపాజిట్ పథకం గడువును 31 డిసెంబర్‌ 2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. పథకం ద్వారా పెట్టుబడి పెట్టిన వారికి 7.1 నుంచి 7.6శాతం వరకు వార్షిక వడ్డీ రేటు చెల్లించనున్నది.

డిపాజిటర్ల నుంచి పథకానికి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ ఎఫ్‌డీ స్కీమ్‌ను ప్రారంభించింది. ఇందులో 400 రోజుల గడువుతో ఈ స్కీమ్‌ ఉంటుంది.

పథకంలో చేరిన సాధారణ ప్రజలకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు మాత్రం 7.6శాతం వడ్డీ చెల్లించనున్నది. వడ్డీని నెలవారీగా, మూడు నెలలు, ఆరు నెలలకోసారి డిపాజిటర్ల కోరిక మేరకు జమ చేయనున్నది.

ఎఫ్‌డీ రేట్లు ఇవే..

7 నుంచి 45 రోజులకు 3శాతం
46 నుంచి 179 రోజులకు 4.5 శాతం
180 నుంచి 210 రోజులకు 5.25 శాతం
211 నుంచి సంవత్సరంలోపు 5.75 శాతం
ఏడాది నుంచి రెండేళ్ల వరకు 6.8 శాతం
2 నుంచి మూడేళ్ల లోపు 7 శాతం
3 నుంచి 10 సంవత్సరాల లోపు 6.5 శాతం
సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.5శాతం అదనంగా వడ్డీ లభించనున్నది.

Exit mobile version