Site icon vidhaatha

ఎనిమిది రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..!

Train Cancelled | దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. హసన్‌పర్తి – ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌ మధ్య మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎనిమిది రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాజీపేట- హసన్ పర్తి, బల్లర్షా – కాజీపేట, కరీంనగర్‌ – సిర్పూర్‌, సిర్పూర్‌-కరీంనగర్‌ మధ్య రైళ్లను జనవరి 13 వరకు రద్దు చేసింది. బోధన్- కరీంనగర్ రైలు డిసెంబర్‌ 20 నుంచి జనవరి 14 వరకు, కరీంనగర్- బోధన్ రైలును జనవరి 13 వరకు, సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్, సిర్పూర్‌ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైళ్లను జనవరి 2 నుంచి 13 వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


ఇటీవల రైల్వేశాఖ ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నది. ఒడిశా బాలాసోర్‌ వద్ద జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో సిగ్నలింగ్‌ వ్యవస్థను సరి చేస్తున్నది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్లను రద్దు చేసింది. మరమ్మతు పనులు పూర్తయ్యాక రైళ్లు తిరిగి యథావిధిగా అందుబాటులోకి తీసుకువస్తున్నది.

Exit mobile version