Site icon vidhaatha

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలెర్ట్‌..! నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ టైమింగ్‌ మారింది..!

Narayanadri Train | దక్షిణ మధ్య రైల్వే తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్‌ను జారీ చేసింది. లింగంపల్లి-తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ టైమింగ్‌ను మార్చినట్లు పేర్కొంది. ఇంతకు ముందు నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ నుంచి సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు తిరుపతికి చేరుకునేది. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా తిరుపతికి ప్రయాణిస్తుంది.


ఈ టైమింగ్స్‌లో భారతీయ రైల్వేశాఖ మార్పులు చేసింది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (12734) సాయంత్రం లింగంపల్లి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరనుండగా.. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రాత్రి 7 గంటలకు చేరుతుంది. ఇక్కడ ఐదు నిమిషాల పాటు ఆగుతుంది. 7.05 గంటలకు బయలుదేరి మరుసటి రరోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అయితే, ప్రయాణికులు రైలు టైమింగ్స్‌ను గమనించి సహకరించాలని కోరింది.


తిరుగుప్రయాణంలో రైలు సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.35 గంటలకు సికింద్రాబాద్‌కు, 6.55 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. రైలు ఇరుమార్గాల్లో బేగంపేట్, సికింద్రాబాద్, బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

Exit mobile version