Secretariat | సచివాలయంలో ఒకే రోజు గుడి, మసీదు, చర్చీల ప్రారంభోత్సవం

Secretariat ఆగస్టు 25మూహుర్తం ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌ విధాత: సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా, తెలంగాణ రాష్ట్రం గంగా జమునీ తహెజీబ్ సంస్కృతిని మరోమారు ప్రపంచానికి చాటే దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చీలను ఒకే రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ […]

  • Publish Date - July 11, 2023 / 03:02 PM IST

Secretariat

  • ఆగస్టు 25మూహుర్తం ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

విధాత: సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, రాజ్యాంగం అందించిన లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా, తెలంగాణ రాష్ట్రం గంగా జమునీ తహెజీబ్ సంస్కృతిని మరోమారు ప్రపంచానికి చాటే దిశగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చీలను ఒకే రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా మత పెద్దలను సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని ఖరారు చేశారు.

ఆగస్టు 25 వ తేదీన హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేసి దేవాలయాన్ని సీఎం పున: ప్రారంభిస్తారు. అదే రోజున ఇస్లాం, క్రిస్టియన్ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో మసీదును, చర్చీని కూడా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.

ఈ మేరకు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సిఎంవో అధికారులు, ఆర్ అండ్ బి ఆధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాసచివాలయం ఉద్యోగుల సంఘం కార్యవర్గంతో, హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాల పెద్దలతో సంప్రదించి ఒకే రోజున మూడు మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించే చారిత్రక నిర్ణయాన్ని సిఎం కేసీఆర్ తీసుకున్నారు. త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు ఈ మూడు ప్రార్థనా మందిరాలు అందుబాటులోకి రానున్నాయి.

Latest News