CPI Narayana | అధికారుల వేళ్లు నరికినా తప్పులేదు: సీపీఐ నారాయణ

<p>విధాత: ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (AP Graduates MLC Elections) లో పదవ తరగతి కూడా చదవని వారికి డిగ్రీ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు (Fake certificates) ఇచ్చిన అధికారుల వేళ్లు నరికిన తప్పు లేదని, అలా చేస్తే ఇంకోసారి ఇలాంటి తప్పులు ఎవరు చేయరని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రింటింగ్ మిషన్లు పెట్టి మరి నకిలీ సర్టిఫికెట్లు ముద్రించారని, ఒక్కో నియోజకవర్గంలో 15 వేల […]</p>

విధాత: ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (AP Graduates MLC Elections) లో పదవ తరగతి కూడా చదవని వారికి డిగ్రీ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు (Fake certificates) ఇచ్చిన అధికారుల వేళ్లు నరికిన తప్పు లేదని, అలా చేస్తే ఇంకోసారి ఇలాంటి తప్పులు ఎవరు చేయరని సీపీఐ నేత నారాయణ (CPI Narayana) అన్నారు.

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రింటింగ్ మిషన్లు పెట్టి మరి నకిలీ సర్టిఫికెట్లు ముద్రించారని, ఒక్కో నియోజకవర్గంలో 15 వేల వరకు బోగస్ ఓట్లు నమోదు చేశారని, అలాంటప్పుడు రాష్ట్రమంతా ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయో తీవ్రంగా ఆలోచించాలన్నారు.

ఎన్నికల సంఘం దీనిపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేసేలా ఉన్నా ఈ తరహా బోగస్ ఓటర్ల నమోదును అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పదవ తరగతి కూడా చదవని వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన తీరు ఎన్నికల ప్రక్రియ డోల్లతనాన్ని చాటుతుందన్నారు.

నిర్దిష్టమైన పరిమిత సంఖ్యలో ఓటర్లు ఉండే ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలలోనే ఇంత తీవ్ర స్థాయిలో దొంగ ఓట్ల సమస్య ఏర్పడిన తీరు చూస్తే సాధారణ ఎన్నికల్లో ఇంకెంత అద్వాన్నమైన పరిస్థితి ఉంటుందో అంచనా వేసుకొని ఎన్నికల సంఘం అక్రమాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.