Site icon vidhaatha

One Nation One Election | వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌పై విపక్షాల గరం

One Nation One Election |

విధాత, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వన్ నేషన్‌, వన్ ఎలక్షన్ విధానంపై ప్రతిపక్షాలు ఒక్కోక్కటిగా గళం విప్పుతున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్రం ప్రతిపాదించవచ్చన్న ఊహాగానాల నేపధ్యంలో ఈ ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నాయి.

సీపీఐ పార్టీ నేత కె.నారాయణ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ లీడర్ వన్ లాంగ్వేజ్‌ విధానం ఆర్‌ఎస్‌ఎస్ పద్దతంటూ మండిపడ్డారు. రాజ్యంగం అక్కర్లేదన్నట్లుగా ఇష్టారాజ్యంగా బీజేపీ సంఖ్యాబలంతో బిల్లులను ఆమోదించడం పార్లమెంటరీ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమేనంటూ తప్పుబట్టారు. పైకి ఎలక్షన్ ఖర్చు ఆదా అవుతుదంటూ బీజేపీకి చెబుతున్నప్పటికి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంతో తన రాజకీయ ఎజెండాను అమలు చేసే పన్నాగం చేస్తుందన్నారు.

అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రజావ్యతిరేకతను ఎదుర్కోంటుందని, ముందస్తు ఎన్నికలకు వెళితే ముందే అధికారం నుండి దిగిపోతారంటూ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థతలో జమిలి ఎన్నికల ప్రక్రియపై అన్ని పార్టీలతో చర్చించాల్సివుంటుందన్నారు. రాజ్యంగాన్ని ఇష్టామొచ్చినట్లుగా మార్చడానికి వీల్లేదన్నారు.

అటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై స్పందిస్తు తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతామన్నారు. బీఆరెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిని సిద్ధమన్నారు. బీజేపీ వాళ్లు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనతో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను ముందుకు తెచ్చినట్లుగా కనబడుతుందన్నారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం దేనికైనా సిద్ధమని, దేశంలో ఏ పార్టీకి, ప్రభుత్వాలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం, పార్టీ భయపడేది కాదన్నారు. దేశంలో ఏ నాయకుడు చేయని రీతిలో ఒకేసారి 115మంది అభ్యర్థులను ప్రకటించిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

Exit mobile version