Site icon vidhaatha

Shamshabad Airport Drugs | శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ. 50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

Shamshabad Airport Drugs | విధాత, శంషాబాద్ ఏయిర్ పోర్టులో డీఆర్‌ఐ అధికారులు 50కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. లావోస్ నుంచి వచ్చిన నలుగురి మహిళలను అరెస్టు చేశారు. ఐదు కిలలోల్ కొకైన్ సీజ్ చేశారు. భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం అధికార యంత్రాంగం ఉలిక్కి పడింది. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ సాగిస్తున్నారు.

మహిళలు తాము తెస్తున్న డ్రగ్స్‌ను ఎవరికి హైద్రాబాద్‌లో డెలివరి చేస్తున్నారన్నదానిపై డీఆర్‌ఐ, పోలీస్ యంత్రాంగాం విచారణ చేపట్టింది. ఇటీవల రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌లో తరుచు డ్రగ్స్ కేసులు వెలుగుచూస్తుండటం, హైద్రాబాద్ కు అక్రమంగా రవాణా అవుతున్న డ్రగ్స్ పట్టుబడటంతో పోలీస్ యంత్రాంగం దీనిపై దృష్టి సారించింది.

Exit mobile version