విధాత: ఏపీ వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) విధించిన డ్రెస్ కోడ్ పట్ల సర్వత్రా విమర్శలొస్తున్నాయి. వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్‌లు ధరించ వద్దని, అమ్మాయిలు జుట్టు వదిలేయొద్దని డీఎంఈ తెలిపింది.
ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు తప్పనిసరిగా స్టెతస్కోప్‌ను ధరించి ఉండాలి. బోధకులైన ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులు సౌకర్యవంతమైన చీరెలు ధరించి ఉండాలని తెలపటం గమనార్హం. డ్రెస్ కోడ్ సరయిన నిర్ణయమని కొంతమంది సమర్థిస్తున్నా, కొంతమంది మాత్రం నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.