Singareni | కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలి: లక్ష్మారెడ్డి

<p>Singareni విధాత బ్యూరో, కరీంనగర్: సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, వారికి ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని జెబిసిసిఐ, సభ్యుడు(బిఎంఎస్) కొత్త కాపు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక జవహర్ నగర్ లోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో జరిగిన సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ (బిఎంస్) రామగుండం రీజియన్ కాంటాక్ట్ […]</p>

Singareni

విధాత బ్యూరో, కరీంనగర్: సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, వారికి ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోవాలని జెబిసిసిఐ, సభ్యుడు(బిఎంఎస్) కొత్త కాపు లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.

శనివారం సాయంత్రం స్థానిక జవహర్ నగర్ లోని శ్రీసరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో జరిగిన సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ్ (బిఎంస్) రామగుండం రీజియన్ కాంటాక్ట్ కార్మికుల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సమాన పనికి సమాన వేతనం, హైపవర్ కమిటీ వేతనాలు కోల్ ఇండియా మాదిరిగానే సింగరేణిలో అమలు చేయాలన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని, వారి ఆర్థిక అభివృద్ధి కోసం జాతీయ కార్మిక విధానాన్ని రూపొందించాలని, కనీస వేతనాలకు బదులుగా జీవన వేతనాల స్థిరీకరణ అమలు పరచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.

ఉత్పత్తి, ఉత్పాదకత సాధించడంలో సంస్థాపరంగా కీలకమైన భూమిక పోషిస్తున్నకాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయక శ్రమ దోపిడీకి పాల్పడుతున్న సింగరేణి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బిఎంఎస్ నేతలు యాదగిరి సత్తయ్య, పవన్ కుమార్, రమకాంత్, పులి రాజారెడ్డి, వై సారంగపాణి, పొన్నమనేని వేణుగోపాలరావు, అరుకాల ప్రసాద్, సాయవేణి సతీష్, పల్లె శ్రీనివాస్, తాట్ల లక్ష్మయ్య, పోతరాజు భాస్కర్, తుమ్మ గట్టయ్య, నీలం శ్రీనివాస్, ఆరేల్లి వెంకటరాజం, పోలు యాదగిరి, బండారి శ్యాంసుందర్, చెన్నూరి రమేష్, గుండబోయిన భూమయ్య, చిగురు లక్ష్మణ్, గొడుగు సమ్మయ్య, సుంకర్ సురేష్, రాదండి తదితరులు పాల్గొన్నారు.

కార్మిక సంఘాల వ‌ల్లే 11వ వేతన ఒప్పందం అలస్యం..

సింగరేణిలోని కొన్ని కార్మికసంఘాల మూలంగానే 11వ వేతన ఒప్పందం అమలులో జాప్యం జరుతున్నదని జెబిబిసిసిఐ సభ్యుడు కొత్తకాపు లాక్ష్మారెడ్డి ఆరోపించారు. గోదావరిఖని శిశుమందిర్ లో బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

సింగరేణి కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కార్మిక సంఘాలు వెజ్ బోర్డు సమావేశాల్లో తమ స్వప్రయోజనాలను పక్కనపెట్టి వేతన ఒప్పందాల అమలుకు సహకరించాలని కోరారు. ఈనెల 18న జరిగిన 11వ వేతన ఒప్పదం 9వ సమావేశంలో కొత్తగా సభ్యత్వం పొందిన యూనియన్ చేసిన హడావిడి, అడ్డుపుల్లల కారణంగానే వేతన ఒప్పందం అలస్యమవుతుందని అన్నారు. వేతన ఒప్పందంలో కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తామని తెలిపారు.

పర్మినెంట్ కార్మికుల మాదిరిగా కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులకు మెడికల్ సౌకర్యం కల్పించేలా, సీఎంపిఎఫ్ వర్తించేలా పోరాడతామన్నారు. అలాగే సీఎం పిఎఫ్ బోర్డు సమావేశంలో రిటైర్డ్ కార్మికులకు మినిమమ్ గ్యారంటీ పెన్షన్ 5 వేలు ఉండాలని పోరాడతామన్నారు. సింగరేణిలో ప్రమాదాల నివారణకు డిఎంఎస్ అధికారులు కృషి చేయడం లేదన్నారు.ఈ విషయంలో మే 21న ధన్ బాద్ లో బిఎంఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సింగరేణి సంస్థకు తెలంగాణ ప్రభుత్వం బకాయి ఉన్న డబ్బులను వెంటనే చెల్లించాలని యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. సమావేశంలో బి ఎం ఎస్ నాయకులు మండ రమాకాంత్, పులి రాజయ్య, ఆకుల హరి, సతీష్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News