Singer Kalpana: సింగర్ కల్పన ఆత్మహత్యా యత్నం కారణమిదే!

విధాత, వెబ్ డెస్క్: సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యా యత్నాని (Suicide Attempt) కి కారణం (Reason) తెలిసింది. నిన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన కల్పన స్థానిక హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు కోలుకుంటున్నారు. ఇవాళ సింగర్ కల్పన స్టెట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. కేరళలో ఉన్న తన పెద్దకూతురిని హైదరాబాద్ లో చదువుకోవడానికి రావాలని కోరానని..అందుకు తన కూతురు నిరాకరించి అక్కడే ఉంటానని చెప్పిందని కల్పన వెల్లడించింది. కూతురి నిర్ణయంపై ఆవేదనతో నిద్ర […]

విధాత, వెబ్ డెస్క్: సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యా యత్నాని (Suicide Attempt) కి కారణం (Reason) తెలిసింది. నిన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన కల్పన స్థానిక హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు కోలుకుంటున్నారు. ఇవాళ సింగర్ కల్పన స్టెట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. కేరళలో ఉన్న తన పెద్దకూతురిని హైదరాబాద్ లో చదువుకోవడానికి రావాలని కోరానని..అందుకు తన కూతురు నిరాకరించి అక్కడే ఉంటానని చెప్పిందని కల్పన వెల్లడించింది. కూతురి నిర్ణయంపై ఆవేదనతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా ఆమె పోలీసులకు వివరించింది.

కల్పన ఊపిరితిత్తులలో నీరు చేరడంతో ఇన్ఫెషన్ అయ్యిందని క్రమంగా కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు. సింగర్ కల్పన తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్నాక ప్రసాద్ ను వివాహం చేసుకుంది. ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న సమయంలో తను ఇంట్లో లేనని పనిమీద రెండు రోజుల క్రితమే బయటకు వెళ్లినట్లుగా తెలిపాడు. గతంలోనూ 2010లో తన మొదటి భర్తతో విడాకులతో కుంగిపోయి పిల్లల పోషణ కష్టమైన సందర్భంలోనూ తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని..ఆ సమయంలో ప్రముఖ సింగర్ చిత్ర ఇచ్చిన ధైర్యంతో ఆ ప్రయత్నం విరమించుకుని మళ్లీ జీవితంలో నిలదొక్కుకున్నానని కల్పన చెప్పింది. ఈ నేపథ్యంలో కల్పన ఆత్మహత్య యత్నంకు పాల్పడటం చర్చనీయాంశమైంది.

మా అమ్మ సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు: కల్పన కూతురు

మరోవైపు మా అమ్మ ఆత్మహత్యా యత్నం చేసుకోలేదని..నిద్ర మాత్రల ఓవర్ డోస్ వల్లె అస్వస్థతకు గురయ్యారని కూతురు(Kalpana’s daughter) మీడియాకు చెప్పడం గమనార్హం. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని..తొందర్లోనే మళ్లీ ఎప్పటిలాగా మీ ముందుకు వస్తారని పేర్కొంది.