Site icon vidhaatha

CM Revanth Reddy: బెట్టింగ్ యాప్స్ పై సిట్ విచారణ : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy: ఆన్ లైన్ బెట్టింగ్స్ యాప్స్ మోసాలు..ప్రమోషన్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై సిట్ ఏర్పాటుకు ఆదేశించారు. ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని..సిట్ విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారని..దీంతో సమస్య పరిష్కారం కాదని..యాప్స్ నిర్వాహకులను, బాధ్యులను కూడా విచారించాలన్నారు. ఇందుకోసం సిట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

బెట్టింగ్ యాప్స్ పై అసెంబ్లీ వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ లను నిషేధిస్తు చట్టం చేసిందని..అయితే అమలు కాలేదన్నారు. మా ప్రభుత్వం ఆన్ లైన్ బెట్టింగ్ లపై కఠినంగా ఉంటామని, గత చట్టంలో 2ఏళ్లకు మించి శిక్ష కూడా లేదని.. వచ్చే సమావేశాల్లో ఆన్ లైన్ బెట్టింగ్ లపై చట్ట సవరణ చేస్తామన్నారు. గుట్కా వంటి నిషేధిత పదార్ధాలపై నియంత్రణ చేస్తామన్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదంలో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు 11మందిపైన, మియాపూర్ పోలీసులు 25మందిపైన కేసులు నమోదు చేశారు. కేసులలో యూట్యూబర్లు మొదలుకుని టాలీవుడ్ సినీ ప్రముఖుల వరకు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్ ఆదేశాల నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసులన్ని సిట్ పరిధిలోకి రానున్నాయి.

Exit mobile version