Sitakka | మతిభ్రమించి మాట్లాడుతున్న మంత్రులు.. ములుగు ప్రజలకు KTR క్షమాపణ చెప్పాలి: MLA సీత‌క్క‌

Sitakka ప్రతిపక్ష ఎమ్మెల్యే పైన కక్ష సాధింపు తెలంగాణలో కర్ణాటక ఫలితాలు ములుగు నియోజకవర్గ ప్రజలే నా బలం ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు ప్రాంత ప్రజలు తప్పు చేశారని మంత్రి కేటీఆర్ మాట్లాడటం బాధాకరమని, ములుగు ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో […]

  • Publish Date - June 8, 2023 / 12:23 PM IST

Sitakka

  • ప్రతిపక్ష ఎమ్మెల్యే పైన కక్ష సాధింపు
  • తెలంగాణలో కర్ణాటక ఫలితాలు
  • ములుగు నియోజకవర్గ ప్రజలే నా బలం
  • ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు ప్రాంత ప్రజలు తప్పు చేశారని మంత్రి కేటీఆర్ మాట్లాడటం బాధాకరమని, ములుగు ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు.

ఊపిరి ఉన్నంతవరకు ప్రజాసేవలోనే..

ఊపిరి ఉన్నంత వరకు ములుగు ప్రాంత ప్రజల కోసం పని చేస్తానని సీతక్క అన్నారు. మా ప్రాంత ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటున్న నా పైన ఆరోపణలు చేస్తారా? నిన్న కేటీఆర్ చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేస్తున్న నా పైన బిఆర్ఎస్ మంత్రులు కక్షకట్టి టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డా కొద్దీ మంత్రులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి హరీష్ రావు సీతక్క అడుగుతనే మెడికల్ కాలేజీ ఇచ్చినమని చెప్పిన మాటలు మరిచి పోయారా అంటూ ప్రశ్నించారు.

అధికారిక కార్యక్రమాన్ని రాజకీయ సభగా మార్చారు..

నిన్న జరిగిన దశాబ్ది ఉత్సవ సభ రాజకీయ వేదికను తలపించేలా ఉందన్నారు. అధికారిక సమావేశంలో రాజకీయాలు మాట్లాడటం కేటీఆర్ కు తగదని ఎమ్మెల్యే సీతక్క గుర్తుచేశారు. అధికారిక సమావేశంలో ప్రభుత్వ అధికారుల ముందు కేటీఆర్ రాజకీయ సభను నడిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణలో కర్ణాటక ఫలితాలు పునరావృత్తమ‌వుతాయని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సీతక్క ధీమా వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని 2018 నుండి పోరాటం చేస్తుంది నేను, ఉద్యమాలు మావి రాజభోగాలు మీవా అంటూ ప్రశ్నించారు. ములుగు జిల్లా ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల పోరాటాల ఫలితంగానే వచ్చిందన్నారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తప్పా?

మల్లంపెల్లి, రాజు పేట, లక్ష్మిదేవి పేటల‌ను మండలాలు చెయ్యమనడం తప్పా? గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించాలనడం, గోదావరి జలాలు ములుగు ప్రాంతానికి ఇచ్చిన తరువాతనే మిగతా ప్రాంతాలు తీసుకోవాలనడం తప్పా? అంటూ నిలదీశారు. ఏటూరు నాగారం మండల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ చెయ్యాలనడం, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అసెంబ్లీలో, బయట నా గొంతును వినిపించడం తప్పా ? అంటూ ప్రశ్నించారు.

ములుగు జిల్లా కేంద్రములో నూతన బస్ స్టాండ్ నిర్మించాలని కొట్లాడటం, నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యడం, పస్రా కేంద్రంగా నర్సింగ్ కాలేజీ కావాలనడం, కొత్తగూడ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి అనడం తప్పా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నలు సంధించారు.

కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి భగవాన్ రెడ్డి, మండల అధ్యక్షులు ఎండీ చాంద్‌పాషా, జాడి వెంకటేశ్వర్లు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకుతోట చంద్ర మౌళి, బండి శ్రీనివాస్, నల్లెల భరత్ కుమార్, సర్పంచ్ గండి కల్పన కుమార్ తదితరులు ఉన్నారు.

Latest News