Sreleela | ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ హీరోయిన్‌గా శ్రీలీల మారింది. తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సాధించి వరుస సినిమాల్లో నటిస్తున్నది. ఇప్పుడు ఏకంగా పది సినిమాలకుపైగానే నటిస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారింది. ఈ క్రమంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబోట్టుకోవాలనే సామెతను చక్కగా ఒంటబట్టించుకుంటున్నది. ప్రస్తుతం ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే ముద్దు సీన్లకు ఒకే చెప్పినట్లు సమాచారం.
గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తెరక్కుతున్నది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. సినిమా కథకు అనుగుణంగా హీరో హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సీన్ ఉంటుందని తెలుస్తుంది. అయితే, ఏ హీరో సినిమా అయినా సరే కండీషన్స్ పెట్టే శ్రీలీల.. విజయ్ దేవరకొండతో ముద్దసీన్లకు ఒకే చెప్పినట్లు సమాచారం. ఇక విజయ్ దేరకొండకు క్రేజ్ భారీగా ఉంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ విజయ్ దేవరకొండతో ముద్దు సీన్లలో నటించాలని ఉందని బహిరంగంగానే ప్రకటించారు. దాంతో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజో తెలిసిపోతుంది.
ఇక విజయ్ దేరకొండ ప్రస్తుతం ఖుషీ చిత్రంలో నటిస్తున్నాడు. లైగర్ డిజాస్టర్ కావడంతో నిరాశకు గురైన విజయ్.. ఖుషీతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పలు పాటలు విడుదలవగా.. మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా అయ్యాక గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా మంచి కథతో తెరకెక్కబోతుందని తెలుస్తున్నది.
ఇక శ్రీలీల మహేశ్‌బాబు సరసన గుంటూరు కారం, పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, అనగనగా ఒక రోజు, జూనియర్ సినిమాలతో పాటు బాలకృష్ణ108, దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో రానున్న చిత్రాలతో పాటు పంజా వైష్ణవ్ తేజ్, నితిన్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నది.