Site icon vidhaatha

Sreeleela | ‘చచ్చింది గొర్రె’.. శ్రీలీలకు దూల తీరిపోతుంది అక్కడ..

Sreeleela |

చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నట్టుగా అయింది పాపం ఆ హీరోయిన్ పని. వరసపెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి కదా అని.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్నింటికీ ఓకే చెప్పేసింది. తీరాచూస్తే ఎటూ కదలలేక గింజుకుంటుంది. విషయంలోకి వెళితే ఓవర్ నైట్ టాప్ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్ళిసందD’తో అందరి దృష్టిలోనూ పడింది.

ఆ తర్వాత వచ్చిన మాస్ రాజా రవితేజ మూవీ ‘ధమాకా’లో కూడా అందరినీ ఆక్టటుకుంది శ్రీలీల. ఈ కన్నడ ముద్దుగుమ్మకు ఎవరు చెప్పారో తెలీదు కానీ ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకోవాలి’ అనే సామెతలా.. నాలుగు రాళ్ళు ఇప్పుడే వెనకేసుకోవాలని అనుకుందో ఏమో.. అవకాశాలు వస్తున్నాయి కదా అని వచ్చిన ప్రతి ఆఫర్‌కీ ఓకే చెప్పేసింది.

అయితే మరోపక్క శ్రీలీలకు డిమాండ్ కూడా అలాగే ఉంది. స్టార్ హీరోల దగ్గర నుంచి ఓ మోస్తరు హీరో వరకూ.. అలాగే అప్పుడే కొత్తగా సినిమా చేస్తున్న ప్రతి కుర్రహీరోకీ కూడా శ్రీలీలే హీరోయిన్‌గా కావాల్సి రావడంతో దర్శక నిర్మాతలు శ్రీలీల కాల్షీట్స్ మీద పడ్డారు. ఇదే అదునుగా వచ్చిందే అవకాశం అన్నట్టు శ్రీలీల కూడా వరుసగా అన్ని ఆఫర్స్‌నీ ఓకే చేసేసింది. ఇప్పుడేమో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక తెగ ఇబ్బంది పడిపోతుందట.

కక్కుర్తి కాకపోతే ‘ధమాకా’ తర్వాత శ్రీలీల నటించిన ఒక్కసినిమా కూడా ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. కనీసం ఒకటన్నా విడుదలై ఉంటే బావుండేది. వరుసగా వస్తున్న ఆఫర్స్ అన్నీ ఒప్పేసుకుని ఇప్పుడు ఒకరోజు హైదరాబాద్‌లో ఉంటే, మర్నాడు బెంగుళూరులో.. మరో రోజు విదేశాల్లో షూటింగ్స్‌కి హాజరు కాలేక తలప్రాణం తోకకి వస్తుందట. ఇదంతా ఇలా ఉంటే అవకాశాలు వస్తున్నాయి కదా అని ఒకేసారి అందరికీ షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకోవడం వల్లే ఇన్ని తిప్పలూ వచ్చాయని సినీ జనాల్లో అక్షింతలు వేసే వాళ్ళూ లేకపోలేదు.

ఇక ఇప్పటి వరకూ కమిట్ అయిన మూవీల వరకూ పూర్తి చేయడానికే తిప్పలు పడుతుంది శ్రీలీల. వీటిని పూర్తి చేసే క్రమంలో.. మరెన్ని మంచి అవకాశాలను చేజార్చుకుంటుంది కూడా. వెంటవెంటనే అవకాశాలు, స్టార్ హీరోలు అని ఓకే చెప్పేసిన శ్రీలీల.. ఇప్పుడు ఏ సినిమాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలో తెలీక అయోమయంలో పడిపోయింది.

మూవీ మేకర్స్ కూడా శ్రీలీల తొందరపాటుకు కాస్త గుర్రుగానే ఉన్నారట. ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకోగానే సరా.. టైం బ్యాడ్ కాకపోతే అని సన్నాయి నొక్కులు నొక్కేవాళ్లూ లేకపోలేదు. ఏది ఏమైనా కత్తి మీద సాములా మారిపోయింది పాపం శ్రీలీల పరిస్థితి. కొందరు నెటిజన్లయితే శ్రీలీల తింగరి పనికి ‘చచ్చింది గొర్రె’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా కాస్త నిదానంగా ఉంటే బావుండేది.. అంతేగా?

Exit mobile version