అండర్‌వేర్‌తో ట్రంప్‌.. పెద్దవాడని ఆయనతో ‘ఆ’ పని చేశా!

తాను బాత్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చేసరికి ట్రంప్‌ అండర్‌వేర్‌తో ఉన్నాడని ఆయనతో శృంగారం చేశానని నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌ చెబుతున్నది

  • Publish Date - March 24, 2024 / 01:26 PM IST

ట్రంప్‌ రహస్యాలు బయటపెడుతున్న నీలిచిత్రాల నటి

న్యూయార్క్‌: తాను బాత్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చేసరికి ట్రంప్‌ అండర్‌వేర్‌తో ఉన్నాడని ఆయనతో శృంగారం చేశానని నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్‌ చెబుతున్నది. ఇష్టపూర్వకంగానే అతడితో కలవడానికి కారణం కూడా వివరించిన స్టార్మీ.. ‘ఆయన వయసులో పెద్దవాడు. పురుషుడు. అంతేకాకుండా నేను దక్షిణాది నుంచి వచ్చిన.. పెద్దలను గౌరవించాలన్న ఆలోచనలు కలిగి ఉన్నదాన్ని కావడం, మంచి అమ్మాయిని కావడం వల్లే’ అని చెప్పుకొచ్చింది. రాబోయే నవంబర్‌ నెలలో జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. దానికంటే ముందు కోర్టులో స్టార్మీ డేనియల్స్‌ చెప్పబోయే వాంగ్మూలం కీలకం కానున్నది. ఈ సమయంలో స్టార్మీ డేనియల్స్‌ పాల్గొన్న పీకాక్‌ అనే డాక్యుమెంటరీ అమెరికాలో హల్‌చల్‌ చేస్తున్నది. ఇప్పటికే స్టార్మీ వరుస ‘మీడియా టూర్‌’లలో బిజీబిజీగా ఉన్నది. అమెరికాలోని మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా సైతం ట్రంప్‌ మాటల కంటే స్టార్మీ మాటలే విశ్వసనీయంగా ఉన్నాయని పేర్కొంటుండటం గమనార్హం.

ఆమె కోర్టులో వాంగ్మూలం ఇవ్వకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్టార్మీతోపాటు ప్లేబాయ్‌ గర్ల్‌ కరెన్‌ మెక్‌ డౌగల్‌లను వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు పిలవడంలో అభ్యంతరం ఏమీ లేదని స్టేట్‌ కోర్టు జడ్జి జువాన్‌ మెర్చన్‌ సోమవారం మార్చి 19, 2024న తీర్పు చెప్పారు. ఆ ఇద్దరు మహిళలతో శృంగారం చేసిన విషయాన్ని దాచిపెట్టేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారన్న ప్రాసిక్యూటర్ల వాదన నేపథ్యంలో వారి వాంగ్మూలం కీలకమని ఆయన తేల్చేశారు. తాను బిజినెస్‌ రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలకు, వారు ఇచ్చే వాంగ్మూలానికి సంబంధం లేదని, తానేమీ తప్పు చేయలేదని ట్రంప్‌ వాదిస్తున్నారు. వాస్తవానికి తన మాజీ న్యాయవాది మైఖేల్‌ కొహెన్‌కు ట్రంప్‌ చేసిన చెల్లింపులపై ఈ కేసు నడుస్తున్నది. నీలి చిత్రాల తార స్టార్మీతో ట్రంప్‌ 2006లో శృంగారంలో పాల్గొన్నారని, 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ విషయం రహస్యంగా ఉంచేందుకు ఆమెకు సొమ్ము ముట్టచెప్పారన్నది ఆరోపణలు ఉన్నాయి.

అయితే.. లాయర్‌కు చెల్లించిన డబ్బును తన లీగల్‌ ఖర్చుల కింద రికార్డుల్లో చూపడం, అందుకోసం తప్పుడు రికార్డులు సృష్టించడం వివాదానికి దారి తీసింది. ప్లేబాయ్‌ గర్ల్‌ కరెన్‌ మెక్‌ డౌగల్‌.. తనకు ట్రంప్‌తో సంబంధం ఉన్నదని చెబుతున్నది. ఈమెకు కూడా ట్రంప్‌ చెల్లింపులు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. లాయర్‌ ఖర్చులను 1.30 లక్షల డాలర్లుగా ఆయన రికార్డుల్లో నమోదు చేయించారు. కానీ.. ఆ సొమ్ము వాస్తవంగా స్టార్మీ డేనియల్స్‌కు అందిందని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. కరెన్‌ మెక్‌ డౌగల్‌లకు కూడా 1.50 లక్షల డాలర్లు ఇవ్వడం ద్వారా ఆమెతో తనకు ఉన్న సంబంధాన్ని బయటపడకుండా చూసుకున్నారని అభియోగాలు మోపారు. వివాహేతర సంబంధంతో ట్రంప్‌ ఒక బిడ్డను కన్నాడని చెబుతున్న డినో సాజుడిన్‌ అనే వ్యక్తి 30వేల డాలర్లు చెల్లించినట్టు చెబుతున్నారు.