Site icon vidhaatha

Desert Whale| అశ్చర్యం…ఎడారిలో తిమింగలం!

విధాత: తిమింగలాలు సముద్రాల్లో జీవించే భారీ జలచరాలు. సముద్రాల్లోని ఇతర జీవరాశిని ఆరగిస్తూ వాటి మనుగడ కొనసాగిస్తుంటాయి. అలాంటి భారీ తిమింగలం ఓ ఎడారిలో దర్శనమిచ్చింది. ఎడారిలో తిమింగలం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..అదేనండి తిమింగం శిలాజం ఒకటి ఎడారిలో లభించింది. ఎడారిలో తిమింగలం శిలాజం ఎలా వచ్చిందనుకుంటున్నారా? ..ఇక్కడే బిగ్ ట్విస్టు ఉంది. మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని అరుదైన తిమింగలం శిలాజం(అస్థిపంజరం) ఈజిప్టులోని వాడి అల్ హితాన్‌లో కనుగొనబడింది. అది ఏకంగా 1. 37 మిలియన్ సంవత్సరాల పురాతన తిమింగలం శిలాజంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకప్పుడు ఈ ఎడారి ప్రాంతామంతా తొలి తరం నడిచే తిమింగలాలకు, జంతువులకు ఆధారిత ప్రాంతంగా ఉండేదట. జీవరాశి పరిణామ క్రమంలో చోటుచేసుకున్న మార్పులతో తిమింగలాలు జలచరాలుగా మారాయని..జీవరాశి పరిణామ క్రమానికి ఈ ప్రాంతంలోని తిమింగలాల శిలాజాలు నిదర్శనమని నిర్ధారించారు.

అయితే ఇన్ని సంవత్సరాలుగా ఆ తిమింగలం శిలాజం చెక్కు చెదరకుండా సంపూర్ణంగా సంరక్షించబడటం గొప్ప విశేషమని శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈజిప్టులోని వాడి అల్ హితాన్‌ ఎడారి ప్రాంతాన్ని వేల్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఈజిప్టు ఎడారులలో ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం తొలి తరం తిమింగలాల శిలాజాలకు ప్రసిద్ధి చెందింది. 40మిలియన్ సంవత్సరాల నాటి తొలి తరం తిమింగలాలే కాకుండా, సొరచేపలు, మొసళ్ళు, సముద్రపు పాములు, రంపపు చేపలు, తాబేళ్ల శిలాజాలు సైతం ఇక్కడ కనుగొనబడ్డాయి.

Exit mobile version