Suryapeta
- పరారీలో నిందితులు..
విధాత: సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మోతే మండలం నరసింహపురం నుండి గోపతండాకు అక్రమంగా తరలిస్తున్న 950 కిలోల నల్ల బెల్లం, 22 లీటర్ల నాటు సారా, 50 కిలోల బెల్లం పటికను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.
ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శంభు ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు ఆయన ఆదేశాలతో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా గోపతండాకు చెందిన కుర్ర తిరుపతి, గుగులోతు సురేష్ లు ట్రాక్టర్ లో నల్ల బెల్లం, నాటు సారాయి, పటిక తరలిస్తుండగా సిబ్బంది ద్విచక్ర వాహనంతో ఆపడానికి ప్రయత్నించారు.
వారు ఆపకుండా సిబ్బంది ఉన్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ తో తొక్కించి హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడి నుండి ట్రాక్టర్ ను వదిలి పారిపోయారు. వారి దాడిలో హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ట్రాక్టర్, ద్విచక్ర వాహనం, 22 లీటర్ల నాటు సారాయి, 950 కిలోల నల్ల బెల్లం, 50 కిలోల పటికను స్వాధీన పరుచుకుని సీజ్ చేశారు.
ముగ్గురు నిందితులు పరారిలో ఉన్నారు. ఈ దాడులలో ఎక్సైజ్ అదికారులు కిషన్, కె. రాఘవ, సబ్ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, శివకృష్ణ, సిబ్బంది అప్సర్ అలీ, శేఖర్ రెడ్డి, అయుబ్ ఖాన్, నాగరాజు, బ్రహ్మం పాల్గొన్నారు.