విధాత: హుజూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు గరిడేపల్లి, పాలకీడు, మటంపల్లి మండలాల్లో నిర్వహించిన దాడులలో 630 కిలోల నల్ల బెల్లం(Jaggery), 20 కిలోల పటిక, 35 లీటర్ల నాటు సారా, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు. కీతవారిగూడెం గ్రామంలో అరవింద్ అనే వ్యక్తి నుండి 40 కిలోల బెల్లం,ఐదు లీటర్ల సారా తరలిస్తుండగా టీవీఎస్ వాహనంతో పాటు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కప్పుడియా తండాకు చెందిన వాంకుడొత్ రవీందర్ నుండి 40 కిలోల బెల్లం, 10 లీటర్ల సారాని హీరో మోటార్ సైకిల్ పై తరలిస్తుండగా పట్టుకున్నారు. అనంతరం గరిడేపల్లికి చెందిన గుండు ఆంజనేయులు ఇంటి నుండి 5 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు.
బిల్యా నాయక్ తండాకి చెందిన బానోతు బిక్యా ఇంటి నుండి 550 కిలోల 11బస్తాల నల్ల బెల్లం, 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. గడ్డిపల్లి గ్రామ శివారు నందు రావూరి వెంకన్న సుజుకి ద్విచక్ర వాహనంపై 20 కేజీల పటిక, ఐదు లీటర్ల సారా తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్వహించిన దాడులలో ఎస్సైలు సతీష్ కుమార్ రెడ్డి, వెంకన్న సిబ్బంది నాగరాజు, రఫీ, నాగయ్య, నాగమణి, ధనుంజయ్ లు పాల్గొన్నారు.