Chennai Super Kings | చెన్నై సూపర్‌ కింగ్స్‌పై మళ్లీ నిషేధం తప్పదా..? ఎమ్మెల్యే డిమాండ్‌ వెనక కారణాలు ఏంటంటే..?

Chennai Super Kings | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మంచి క్రేజ్‌ ఉంది. ఈ జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోనికి కెప్టెన్‌. ఈ జట్టుకు కోట్లాది మంది అభిమానులున్నాయి. ఆ జట్టు మ్యాచ్‌ ఉంటే చాలు అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. అయితే, గతంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంతో గతంలో జట్టుపై రెండేళ్లు నిషేధానికి గురైంది. మళ్లీ జట్టుపై బ్యాన్‌ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఐపీఎల్‌లో […]

  • Publish Date - April 12, 2023 / 02:00 PM IST

Chennai Super Kings | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మంచి క్రేజ్‌ ఉంది. ఈ జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోనికి కెప్టెన్‌. ఈ జట్టుకు కోట్లాది మంది అభిమానులున్నాయి. ఆ జట్టు మ్యాచ్‌ ఉంటే చాలు అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారు. అయితే, గతంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ కారణంతో గతంలో జట్టుపై రెండేళ్లు నిషేధానికి గురైంది. మళ్లీ జట్టుపై బ్యాన్‌ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఐపీఎల్‌లో బ్యాన్ అనే పేరు చెబితే రాజస్థాన్, చెన్నై జట్లు జ్ఞప్తికి వస్తాయి. ఫిక్సింగ్, బెట్టింగ్‌ ఆరోపణల నేపథ్యంలో 2016-17 సీజన్లలో జట్లపై నిషేధం విధించారు. ఆ తర్వాత సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చిన సూపర్‌ కింగ్స్‌ కప్‌ను ఎగరేసుకొని పోయింది.

అయితే, జట్టుపై మరోసారి బ్యాన్‌ విధించాలని డిమాండ్లు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో పీఎంకే ఎమ్మెల్యేలు చెన్నై సూపర్‌ కింగ్స్‌పై నిషేధం విదించాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడు ఆటగాడు ఒక్కడూ లేడని, అలాంటప్పుడు చెన్నై టీమ్ ఎందుకని ఎమ్మెల్యే పీఎంకే ఎమ్మెల్యే ఎస్పీ వెంకటేశ్వరన్ నిలదీశారు. తమిళనాడులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, వారిలో ఎవరికీ ఐపీఎల్‌లో ఆడే చాన్స్‌ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే టైంలో తమిళనాడు క్రీడాశాఖ దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఐపీఎల్ పేరిట చెన్నై జట్టు వ్యాపారం చేస్తోందని అసెంబ్లీలోనే నిరసన తెలిపారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెన్నై సూపర్ కింగ్స్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. తమిళనాడు పేరు వాడుకుని సీఎస్కే భారీ ఆదాయాన్ని ఆర్జిస్తూ.. ఆటగాళ్లను మాత్రం పక్కన పెట్టిందని విమర్శించారు. అయితే, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్‌లో చాలా జట్లు సొంత రాష్ట్రానికి సంబంధంచిన ఆటగాళ్లు లేరని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు. అయితే, ఎమ్మెల్యే డిమాండ్‌ మేరకు చెన్నై జట్టుపై నిషేధం ఉండకపోవచ్చు గాక.. దీనిపై చర్చమాత్రం జరిగే అవకాశాలున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..!

Latest News