TDP VS YCP |టిడిపి మ్యానిఫెస్టోపై వైసిపి దాడి.. సెటైర్లు .. మీమ్స్‌తో సోషల్ మీడియా పోస్టులు

TDP VS YCP విధాత‌: ఆంధ్రప్రదేశ్లో టిడిపి, వైసిపి సోషల్ మీడియా వర్గాల మధ్య పోస్టుల పోరు నిత్యం ఉండేదే.. ఐతే ఏదో ఒక సందర్భం దొరికితే ఈ పోరు మరింత జోరుగా ఉంటుంది. దీనికి ఇప్పుడు నిన్నటి టిడిపి విడుదల చేసిన మ్యానిఫెస్టో ఆజ్యం పోసింది. ఆ మ్యానిఫెస్టోను చూసి టిడిపి వాళ్ళు సంబరపడుతుంటే ఇక వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అప్పుడే ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు కొడాలి నాని, మంత్రులు అంబటి రాంబాబు, […]

  • Publish Date - May 29, 2023 / 04:30 PM IST

TDP VS YCP

విధాత‌: ఆంధ్రప్రదేశ్లో టిడిపి, వైసిపి సోషల్ మీడియా వర్గాల మధ్య పోస్టుల పోరు నిత్యం ఉండేదే.. ఐతే ఏదో ఒక సందర్భం దొరికితే ఈ పోరు మరింత జోరుగా ఉంటుంది. దీనికి ఇప్పుడు నిన్నటి టిడిపి విడుదల చేసిన మ్యానిఫెస్టో ఆజ్యం పోసింది. ఆ మ్యానిఫెస్టోను చూసి టిడిపి వాళ్ళు సంబరపడుతుంటే ఇక వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అప్పుడే ట్రోల్స్ చేస్తున్నారు.

ఇక ఎమ్మెల్యేలు కొడాలి నాని, మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటివారు సైతం మ్యానిఫెస్టోను ఒక కాపీ నోట్ బుక్ అంటూ విరుచుకుపడుతున్నారు. రైతులకు ఏటా ఇరవైవేలు ఆర్థిక సాయం అనే పాయింట్ మీద కౌంటర్లు వేస్తూ గతంలో ఐదేళ్లు అధికారంలో ఉండి రుణమాఫీ చేయలేదు.. హామీ ఇచ్చి మోసం చేసారు. అసలు 2014లో ఇచ్చిన ఎన్నికల మానిఫెస్టో ను టిడిపి వెబ్సైట్ నుంచి తీసేసారు అంటూ ఎగతాళి చేస్తున్నారు.

ఇరవై లక్షల‌ ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అనే అంశాల మీద కూడా గట్టిగానే ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో ఐదేళ్ల పాలనలో ఎంతమందికి ఇచ్చారు చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లు మీద కూడా ట్రోలింగ్ మొదలైంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపిలు ఇచ్చిన హామీల్లో నుంచి కొట్టు కొచ్చినవి తప్ప టిడిపి సొంతంగా ఆలోచించినవి కాదని విమర్శలు చేస్తున్నారు.

అమ్మకు వందనం పేరిట మహిళలకు పదిహేను వేలు ఇస్తాం అనడాన్ని సైతం కాపీ అంటున్నారు. ఇప్పటికే జగన్ అమ్మ ఒడి పేరిట పదిహేను వేలు ఇస్తున్నారని.. అది కూడా కాపీ కొట్టేసి పేరు మారిస్తే ఎలా అని అంటున్నారు.

ఇవి కొన్ని పాయింట్లు మాత్రమే అని.. మిగతావి తరువాత విడుదల చేస్తాం అని టిడిపి వాళ్ళు చెప్పడాన్ని సైతమ్ వైఎస్సార్ సీపీ వెక్కిరిస్తోంది. అవును కర్ణాటక ఎన్నికల్లోంచి కొన్ని పాయింట్స్ తీశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు త్వరలో వస్తున్నాయి. అక్కడి మ్యాని ఫెస్టోలు కూడా వస్తే అందులోంచి కొన్ని పాయింట్స్ కాపీ కొట్టి మిగతా మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తారు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

కోడలి నాని , అంబటి అయితే ప్రెస్సుమీట్లలో నేరుగా చంద్రబాబు మీద తిట్ల పురాణం అందుకున్నారు. మొత్తానికి నిన్న చంద్రబాబు విడుదల చేసిన మ్యానిఫెస్టో సోషల్ మీడియాకు ఫుడ్డు అయింది.

Latest News