Site icon vidhaatha

Telangana Assembly | అసెంబ్లీ స‌మావేశాలు మ‌రో రెండు రోజులు పొడిగింపు..

Telangana Assembly |

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు మ‌రో రెండు రోజుల పాటు పొడిగించారు. బీఏసీలో నిర్ణ‌యించిన మేర‌కు ఆదివారంతోనే అసెంబ్లీ స‌మావేశాలు ముగియాల్సి ఉండే. కానీ టీఎస్ ఆర్టీసీ విలీన బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం ల‌భించిన నేప‌థ్యంలో.. మ‌రో రెండు రోజుల పాటు శాస‌న‌స‌భ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చించిన త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపారు. గ‌వ‌ర్న‌ర్ ఆ బిల్లును ఆమోదించ‌డంతో.. బిల్లును అసెంబ్లీలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

ఆర్టీసీ విలీన బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ విలీన బిల్లును గ‌త రెండు రోజులుగా గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో ఉంచ‌డంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. సంస్ధ ఉద్యోగులు, కార్మికులు ఛ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు పిలుపు ఇచ్చారు.

Exit mobile version