గెలుపు తీరం చేరిన కుటుంబ అభ్యర్థులు

తెలంగాణ అసెబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు.

  • Publish Date - December 3, 2023 / 08:25 AM IST
  •   గెలిచిన బ్రదర్స్‌..కుమారులు..ఓడిన తండ్రులు


విధాత : తెలంగాణ అసెబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు నల్లగొండ, మునుగోడులలో గెలుపొందారు. చెన్నూరు, బెల్లంపల్లిలో వివేక్ వెంకటస్వామి, వినోద్‌లు విజయం సాధించారు.


హుజూర్‌నగర్‌, కోదాడలలో భార్యభర్తలు ఎన్‌. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పద్మావతిలు గెలిచారు. అయితే తండ్రికొడుకులైన మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరిలో ఓడిపోగా, రోహిత్ రెడ్డి మెదక్‌లో గెలిచారు. అటు బీఆరెస్ నుంచి చూస్తే తండ్రికొడుకులైన సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో గెలిచి, కామారెడ్డిలో ఓడిపోగా, మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో గెలిచారు.


మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌లో గెలుపొందగా, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మల్కాజ్‌గిరిలో గెలిచారు.కాంగ్రెస్ నుంచి ఎల్లారెడ్డిలో ఎర్రబెల్లి అల్లుడు మదన్ మోహన్ రావు గెలిచారు..బీఆరెస్ నుంచి పోటీ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తిలో తొలిసారి పోటీ చేసిన యశస్వినిరెడ్డిపై ఓడిపోగా, వరంగల్ తూర్పులో ఆయన తమ్ముడు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడారు.