విధాత, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ చార్జీలను పెంచింది. 20శాతం మేరకు బస్ పాస్ చార్జీలను పెంచిన తెలంగాణ ఆర్టీసీ..పెరిగిన చార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. రూ.1050 ఉన్న ఆర్డీనరీ బస్సు పాస్ చార్జీలను రూ.1400కు పెంచింది. రూ.1300 ఉన్న మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ ను రూ.1600లకు పెంచింది. పెరిగిన బస్ పాస్ చార్జీలతో ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులపై పడనుంది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారం కానున్న బస్ పాస్ చార్జీలతో ఇక తాము కాలేజీలకు ఎలా వెళ్లాలని..ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణ వసతి అమలు చేస్తున్న క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత బస్ పాస్ పథకం ఆర్థిక భారాన్ని తామే చెల్లిస్తున్నామని చెబుతున్నందునా ఇక మా బస్ పాస్ చార్జీలను పెంచడం ఎందుకని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు.