విధాత: రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ షాకింగ్ న్యూస్ అందించింది. భారతీయ రైల్వే ప్రయాణీకుల బ్యాగేజీ(లగేజీ)పై పరిమితులు విధిస్తున్నట్లుగా రైల్వే శాఖ వెల్లడించింది. లగేజీ పరిమితులపై విధించిన నూతన నిబంధనలు మేరకు ఏసీ ఫస్ట్ క్లాస్: 70 కేజీలు, AC 2-టైర్: 50 కేజీలు, AC 3-టైర్ & స్లీపర్: 40 కేజీలు, జనరల్ క్లాస్: 35 కేజీలుగా నిర్ణయించారు. అంతకు మించి బ్యాగేజీ ఉంటే ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించవలసి ఉంటుందని పేర్కొంది.
ప్రయాణించే రైలు బయలుదేరే సమయానికి కనీసం 30 నిమిషాల ముందు బుకింగ్ స్టేషన్‌లోని లగేజీ కార్యాలయంలో క్యారీ-ఆన్ లగేజీని తప్పనిసరిగా సమర్పించాలి. టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు తమ లగేజీని కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. 70-80 కిలోల వరకు అదనపు సామాను తీసుకెళ్లడానికి.. ప్రయాణికులు తమ బ్యాగేజీని బుక్ చేసుకోవాలి.