Temple Lands
హైదరాబాద్, విధాత: రాష్ట్రంలో ఆలయ భూముల అన్యాక్రాంతంపై గతంలోనే కౌంటర్ దాఖలు చేయమని చెప్పినా.. ఇంత వరకు ఎందుకు వేయలేదని సర్కార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ నాటికి తప్పకుండా కౌంటర్ దాఖలు చేయాల్సిందేనని ఆదేశించింది.
ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఆలయ భూముల ఆక్రమణపై మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సి.అనిల్‌కుమార్ రాసిన లేఖను హైకోర్టులో టెకెన్ అప్ పిల్‌గా విచారణకు స్వీకరించింది.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. గతంలో కౌంటర్ వేయాలని ఆదేశించినా వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు వారాలు గడువు ఇస్తున్నామని, ఆ లోగా కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.