1010 చెక్కులకు 814చెక్కులకు చెల్లింపులు చేశాం: సీఎస్ సోమేశ్‌కుమార్
విధాత: ఇటీవల దేశ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన పంజాబ్, హర్యానాకు చెందిన 709 రైతు కుటుంబాలకు 2022 మే 22న 1010 చెక్కులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేయగా వీటిల్లో 814 చెక్కులకు నగదు చెల్లింపులు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను డిపాజిట్ చేయక పోవడంతో నగదు చెల్లింపులు నిలిపి వేయబడ్డాయన్నారు. ఇది సాంకేతిక పోరపాటు తప్ప మరొకటి కాదని తెలిపారు.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్పంధించి, మిగిలిన చెక్కులకు మరికొంత సమయం ఇచ్చి, నగదు చెల్లింపులు జరిగే విధంగా అనుమతివ్వాలని, (రీవాలిడేట్ చేయాలని) ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సాయం కోసం ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ (రెవెన్యూ డిపార్ట్ మెంట్) రాంసింగ్ ను 9581992577 నెంబరులో సంప్రదించవచ్చునని తెలిపారు.