The tiger cubs came into the village
విధాత: పాపం వారం రోజుల క్రిందట కళ్లు తెరిచిన పులి పిల్లలు దరితప్పాయి.. తల్లి నుంచి విడివడిన కూనలు ఊళ్లోకి వచ్చేశాయి. ఓ రైతు వాటిని భద్రంగా దాచి ఉంచి అధికారులకు కబురు పెట్టారు..
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామంలోకి ఈ ఉదయం నాలుగు పులి పిల్లలు వచ్చాయి. ఈ ఊరు అడవిని ఆనుకుని ఉంటుంది. కొలనుభారతి క్షేత్రానికి దగ్గరలో సంగమేశ్వరం దారిలో ఈ గ్రామం ఉంది.
ఒక రైతు ఉదయం తన కళ్ళానికి వెళ్లి వస్తుంటే పులి కూనలు ఆయన వెంట ఊర్లోకి వచ్చాయి. వాటిని గమనించిన ఆయన, కుక్కలు వాటికి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని భావించి వాటిని ఓ ఇంట్లో భద్రపరిచి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.
రెస్క్యూ టీం రంగంలోకి దిగి పులి కూనలను తల్లి వద్దకు చేర్చే ప్రయత్నం చేశారు. సాయంత్రానికి కూడా తల్లి పిల్లల వద్దకు రాకపోవడంతో పులి కూనలు డస్సి పోయాయి. దీనితో అధికారులు వాటిని బైర్లుటికి తరలించి వాటిని ఏసీలో ఉంచి ఆహారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక వాటి సంరక్షణ తిరుపతి వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు అప్పగించాలని నిర్ణయించి నట్లు సమాచారం.
ఈ కూనల వయస్సు వారంలోపే ఉండొచ్చు. పెద్దపులి కూడా మనిషి ఇప్పటికి అర్ధం కాడు, వాటికి నాలుగుకాళ్ల జంతువులు మాత్రమే పరిచయం. అసలే సిగ్గరులైన పులులు అందులో పసి కూనలు ఉదయం నుంచి జనాల హడావుడి, సెల్ఫీలు, ఫోటోలకు బెదిరే అవకాశం ఉంది. షాక్ లోకి కూడా వెళతాయి. ఇవి తల్లి వద్దకు వెళ్లలేక పోతే సర్వైవ్ కావటం చాలా పెద్ద సమస్య, ఎలాంటి ట్రాజిడి జరగకూడదు. పెద్దపులి గ్రామం మీద దాడి చేస్తుందని మీడియాలో ప్రచారం జరుగుతుంది.