Site icon vidhaatha

Tirumala | తిరుమ‌ల కొండ‌పై విషాదం.. చిరుత దాడిలో బాలిక మృతి

Tirumala | తిరుమ‌ల కొండ‌పై విషాదం నెల‌కొంది. శ‌నివారం తెల్లారుజామున అలిపిరి న‌డ‌క మార్గంలో ఓ కుటుంబం కొండ‌పైకి వెళ్తుండ‌గా.. ల‌క్ష్మిన‌ర‌సింహ్మ స్వామి గుడి వ‌ద్ద చిరుత వారిని అడ్డగించింది. ఆరేండ్ల బాలిక‌పై చిరుత దాడి చేసి చంపింది.

మృతి చెందిన బాలిక‌ను ల‌క్షిత‌గా గుర్తించారు. చిన్నారి త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. స‌మాచారం అందుకున్న ఆ సిబ్బంది.. భ‌క్తుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. మెట్ల మార్గంలో వ‌చ్చే భ‌క్తులు పులుల క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించాల‌ని సూచించింది.

ఇదే ఏడాది జూన్ 23న తిరుమల నడకదారిలో ఇలాంటి ఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని హనుమాన్ నగర్‌కు చెందిన శిరీష, కొండయ్యల కుటుంబ సమేతంగా జూన్ 23న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. నడకమార్గంలో ఐదేళ్ల కౌశిక్ తో వెళ్తుండగా ఏడో మైలురాయి దగ్గరకు చేరుకోగానే ఒక్కసారిగా చిరుత దాడి చేసింది.

అమాంతం కౌశిక్ మెడ కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. చుట్టూ ఉన్న వాళ్లు కేకలేయడంతో వెంటనే వదిలేసి పరారైంది. చిరుత దాడిలో బాలుడు కౌశిక్ తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతిలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో చికిత్స తర్వాత మెల్లిగా కోలుకున్నాడు. శ్రీవారి దర్శనం అనంతరం ఇంటికి వెళ్లాడు.

చిరత దాడి తర్వాత అలర్ట్ అయిన టీడీపీ అధికారులు భక్తుల భద్రత కోసం చర్యలు చేపట్టారు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు ప్రత్యేక సూచనలు చేసింది. మెట్ల మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని మైక్‌ల ద్వారా విజిలెన్స్ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేసింది. భక్తుల భద్రత కోసం అవసరమైన చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు అధికారులు.

Exit mobile version