Site icon vidhaatha

Tiger | అరుదైన దృశ్యం.. చిరుత పులిని చంపేసిన పులి

Tiger |

అడ‌విలో ఉండే సింహాలు, చిరుత‌లు అంటేనే అంద‌రి గుండెలు హ‌డ‌లిపోతాయి. మ‌న‌షుల గుండెలే కాదు.. జంతువుల గుండెల్లోనూ రైళ్లు ప‌రుగెడుతాయి. ఎందుకంటే సింహాలు, చిరుతలు మిగ‌తా జంతువుల‌ను వేటాడి చంపేస్తాయి.

కానీ ఇక్క‌డ వేట‌గాడే బ‌లైపోయాడు. పులి చేతిలో చిరుత పులి బ‌లైపోయింది. ఈ అరుదైన దృశ్యం రాజ‌స్థాన్‌లోని ర‌ణంత‌బోర్ నేష‌న‌ల్ పార్కు (Ranthambore National Park)లో ఆవిష్కృత‌మైంది.

చిరుత‌ను పులి వేటాడి, తింటున్న దృశ్యాన్ని ఇండియ‌న్ ఫారెస్టు ఆఫీస‌ర్ ప్ర‌వీణ్ క‌శ్వాన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. ఎప్పుడైతే వేట‌గాడికి ఆక‌లి అవుతుందో అలాంట‌ప్పుడు ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయ‌ని పేర్కొన్నారు.

ర‌ణంత‌బోర్ పార్కులో టైగ‌ర్ చిరుత‌ను తింటుంది. ఇలాంటి దృశ్యాన్ని మీరు ఎక్క‌డైనా చూశారా..? అని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Exit mobile version