Sunstroke | వడదెబ్బను నివారించే చిట్కాలు!

  • Publish Date - April 10, 2024 / 11:55 AM IST

Sunstroke | వేసవికాలంలో ఎండల తీవ్రత, వడగాడ్పులతో ఎండదెబ్బ తాకే ప్రమాదం అధికంగా ఉంటుంది. సాధారణంగా మన శరీరంలో నీటి శాతం తక్కువైనప్పుడు వడదెబ్బకు గురవుతాం. దీనికోసం తగినంత మంచినీళ్లు తాగుతూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అయితే.. వడదెబ్బకు చిట్కాలున్నాయని పెద్దలు అంటున్నారు.

1. ఉల్లిగడ్డలు మంచి చలువని మనందరికీ తెలుసు. ఉల్లిగడ్డలు ఎండాకాలంలో బాగా వాడాలని అంటారు. ఉల్లిగడ్డ రసం ఎండ దెబ్బకు తిరుగులేని మందు. మీరు ఎండ దెబ్బకు గురైతే ఉల్లిగడ్డ రసాన్ని తీసి అరికాలు పాదం పైన, అరచేతిపైన, చెవుల వెనుక భాగం పైన బాగా పూయాలి. దీంతో మన శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గు ముఖం పడుతుంది. ఒక రెండు చెంచాల ఉల్లిగడ్డ రసాన్ని త్రాగడం ద్వారా మంచి ఉపశమనం పొందవచ్చు.

2. సోంఫ్‌ నీళ్లు కూడా మంచి చలువే. ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికి సోంఫ్‌ నీళ్లు తాగించడం ద్వారా విశ్రాంతి కలుగుతుంది. సోంఫ్‌ను ముందు రోజు రాత్రి నీటిలో నాన పెట్టండి. తెల్లారి ఆ నీటిని ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికి తాగించడం ద్వారా ఎండ దెబ్బ నయమవుతుంది.

3. కొత్తిమీర, పుదీనా రెండూ చలువనే. ఎండాకాలంలో పుదీనా రసం తాగాలని తరచుగా చెబుతుంటారు. పుదీనా రసం మన శరీరాన్ని చలువగా ఉంచుతుంది. ఎండ దెబ్బ తగిలినప్పుడు కొత్తిమీర, పుదీనా రసాలను కలిపి తాగడం ద్వారా ఎండ దెబ్బ తగిలిన వ్యక్తికి కొద్దిసేపట్లో దాని ప్రభావం తగ్గిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ రెండు కలిపిన రసాల్లో ఒక చెంచా చక్కెరను కూడా కలిపి త్రాగితే మంచి శక్తివంతంగా పనిచేస్తుంది.

4. ఎండ దెబ్బ తగిలిన వ్యక్తి తలని తడిసిన వస్త్రం కప్పి ఉంచాలి. ఎండ దెబ్బ తగిలిన వ్యక్తి శరీరాన్ని తడిసిన వస్త్రంతో తుడుస్తూ ఉండాలి. దీనివల్ల అతడి శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. తర్వాత అతనికి మంచినీళ్లు తగిన మోతాదులో తాగించండి. అతడి తలపై కప్పిన తడి వస్త్రాన్ని ఎండ దెబ్బ లేదా జ్వరం తగ్గేంత వరకూ ఉంచుతూ ఎప్పటికప్పుడు తడుపుతుండాలి. కానీ.. పరిస్థితి తీవ్రతను గుర్తించి, సకాలంలో తగిన వైద్య సహాయం పొందటం అత్యుత్తమం.

Latest News