Site icon vidhaatha

Traffic Restrictions | హైద‌రాబాద్‌లో బోనాల జాత‌ర‌.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

Traffic Restrictions | సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మహంకాళి బోనాల జాత‌ర నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లోట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు పోలీసులు. ఆది, సోమ‌వారాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. బోనాల పండుగ‌కు మ‌హంకాళి జాత‌ర‌కు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాలు ర‌ద్దీగా ఉండే అవ‌కాశం ఉంది. దీంతో ఆ ఏరియాకు వ‌చ్చే వాహ‌నాల‌ను దారి మ‌ళ్లించ‌నున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వెళ్లే వారు త‌మ షెడ్యూల్ కంటే ఒక గంట ముందే చేరుకోవాల‌ని సూచించారు. ప్లాట్ ఫామ్ నంబ‌ర్ 1కు వ‌చ్చే వారు.. చిల‌క‌ల‌గూడ వైపు నుంచి వ‌చ్చి ప్లాట్ ఫామ్ నంబ‌ర్ 10 నుంచి స్టేష‌న్‌లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాల‌ని పోలీసులు సూచించారు. మ‌హంకాళి ఆల‌యానికి అన్ని వైపులా రెండు కిలోమీట‌ర్ల ప‌రిధిలో ట్రాఫిక్ ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు గ‌మ‌నించాల‌ని పోలీసులు కోరారు.

ఈ మార్గాలు క్లోజ్..

దారి మళ్లింపు ఇలా..

Exit mobile version