Site icon vidhaatha

Uniform Civil Code Bill | పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు

విధాత‌: వ‌చ్చే వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే ఉమ్మ‌డి పౌర స్మృతి బిల్లు (Uniform Civil Code Bill)ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అనంత‌రం బిల్లును ఆ బిల్లును పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీకి పంపనున్న‌ట్టు తెలిపాయి.

ఉమ్మడి పౌర‌స్మృతిపై ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఆ అంశానికి ప్రాముఖ్య‌త‌ సంత‌రించుకున్న‌ది. స్టాండింగ్ క‌మిటీకి బిల్లును పంపనున్న‌ది. వివిధ వర్గాల వాదనలను సంఘం స్వీకరిస్తుంది. లా ప్యాన‌ల్‌, లీగ‌ల్ అఫైర్స్ టీమ్ ప్ర‌తినిధులు త‌మ అభిప్రాయాలు వెల్ల‌డించ‌నున్నారు.

జూలై మూడో వారంలో పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. పాత పార్లమెంటు భవనంలో కొన్ని రోజులు సమావేశాలు జరిగిన తర్వాత, నూతన పార్లమెంటు భవనానికి మారే అవకాశం ఉన్న‌ది. అయితే యూసీసీపై ఇప్ప‌టికే విప‌క్ష పార్టీలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు యూసీసీని వ్య‌తిరేకించాయి.

సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల లా కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. జూలై 3న హాజరు కావాలని ఆదేశించింది. ఉమ్మడి పౌర స్మృతి (UCC)పై అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ లా కమిషన్ జూన్ 14న జారీ చేసిన నోటీసు నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ నోటీసులను జారీ చేసింది.

Exit mobile version