అరుంధతి చుక్క చూపించ‌డం కాదు.. నేరుగా దానికే గురిపెట్టారు

పెళ్లి అంటే చుట్ట‌బ‌క్కాలు, స్నేహితుల సంద‌డి, భాజా భ‌జంత్రీలు, నృత్యాల మ‌ధ్య ఇరువురు ఒక‌ట‌య్యే తంతు. వ‌రుడు వ‌ధువు మెడ‌లో మూడు ముళ్లు

  • Publish Date - March 23, 2024 / 12:20 PM IST

విధాత‌: పెళ్లి అంటే చుట్ట‌బ‌క్కాలు, స్నేహితుల సంద‌డి, భాజా భ‌జంత్రీలు, నృత్యాల మ‌ధ్య ఇరువురు ఒక‌ట‌య్యే తంతు. వ‌రుడు వ‌ధువు మెడ‌లో మూడు ముళ్లు వేసిన త‌రువాత అరుంధ‌తి న‌క్ష‌త్రం చూపిస్తాడు. అయితే యూపీలోని ముజఫర్ నగర్‌లో ఓ నూత‌న జంట మాత్రం అలా కాకుండా వారికంటూ ప్ర‌త్యేక‌త ఉండాల‌ని అత్యుత్సాహంతో తుపాకితో గాల్లోకి కాల్పులు జ‌రిపారు. ఆ సంఘ‌ట‌న‌ను చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పెట్టారు. అదికాస్త వైర‌ల్‌గా మారి పోలీసుల వ‌ర‌కు చేరింది. దీంతో వారిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. వీడియో చూసిన వారంతా తూటా గురి త‌ప్పి పెళ్లికి వ‌చ్చిన వారిలో ఎవ‌రికైనా త‌గిలితే ప‌రిస్థితి ఏంట‌ని, ఇలాంటి వారికి త‌గిన బుద్ధి చెప్పాల‌ని కామెంట్లు పెడుతున్నారు.