Kedarnath | కేదార్‌నాథ్ ఆల‌యంలో ఫొటోగ్ర‌ఫీపై నిషేధం

Kedarnath ఆల‌య ప్రాంగ‌ణంలో ప‌లుచోట్ల నోటీసులు అంటించిన ఆల‌య క‌మిటీ ఫొటోలు వీడియో తీస్తే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు విధాత‌: ఇటీవ‌ల ప్ర‌తీచోట రీల్స్ చేయ‌డం అంద‌రికీ ప‌రిపాటిగా మారింది. ప‌విత్ర ప్ర‌దేశం, అక్క‌డ ఫొటోలు తీయ‌వ‌చ్చా? తీయ‌కూడ‌దా? అనే విచ‌క్ష‌ణ లేకుండా వీడియో తీయడం, రీల్స్ చేయ‌డం, సోష‌ల్‌మీడియాలో పోస్టుపెట్ట‌డం సాధార‌ణ‌మైంది. దీనిని నివారించేందుకు కొన్ని సంస్థ‌లు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వీడియోలు తీయ‌కుండా నిషేధం విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు కేదార్‌నాథ్ ఆల‌యం […]

  • Publish Date - July 17, 2023 / 07:46 AM IST

Kedarnath

  • ఆల‌య ప్రాంగ‌ణంలో ప‌లుచోట్ల నోటీసులు అంటించిన ఆల‌య క‌మిటీ
  • ఫొటోలు వీడియో తీస్తే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిక‌లు

విధాత‌: ఇటీవ‌ల ప్ర‌తీచోట రీల్స్ చేయ‌డం అంద‌రికీ ప‌రిపాటిగా మారింది. ప‌విత్ర ప్ర‌దేశం, అక్క‌డ ఫొటోలు తీయ‌వ‌చ్చా? తీయ‌కూడ‌దా? అనే విచ‌క్ష‌ణ లేకుండా వీడియో తీయడం, రీల్స్ చేయ‌డం, సోష‌ల్‌మీడియాలో పోస్టుపెట్ట‌డం సాధార‌ణ‌మైంది. దీనిని నివారించేందుకు కొన్ని సంస్థ‌లు ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వీడియోలు తీయ‌కుండా నిషేధం విధిస్తున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు కేదార్‌నాథ్ ఆల‌యం కూడా చేరింది.

ఉత్త‌రాఖండ్‌లోని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ కేదార్‌నాథ్ ఆలయంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిషేధించింది. ఎవరైనా ఫొటోలు తీస్తే, వీడియోలు తీస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు కేదార్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో పలుచోట్ల ఆలయ కమిటీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆల‌య క‌మిటీ సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

“గతంలో కొంతమంది యాత్రికులు ఆలయంలో అసభ్యకరమైన రీతిలో వీడియోలు, రీల్స్‌తో పాటు చిత్రాలను క్లిక్ చేసేవారు. అది ఇత‌ర యాత్రికుల‌కు ఇబ్బందిగా మారింది. ఇక‌పై ఆల‌యంలో ఫొటోలు, వీడియోలు తీయ‌డం నిషేధించాం. ఈ నిర్ణ‌యం ఖచ్చితంగా అమలు చేయబడుతుంది, అందుకే హెచ్చరిక బోర్డుల‌ను కూడా కేదార్‌నాథ్‌లో ఏర్పాటు చేశాం* అని బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర తెలిపారు

Latest News