Gyanvapi | జ్ఞానవాపి విగ్రహాలకు పూజలు చేసుకోండి

జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలోని హిందూ దేవతా విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు హిందూవులకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది

  • Publish Date - January 31, 2024 / 11:05 AM IST

  • వారణాసి హైకోర్టు

Gyanvapi | విధాత : జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలోని హిందూ దేవతా విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు హిందూవులకు వారణాసి కోర్టు అనుమతిచ్చింది. కోర్టు అనుమతి పట్ల హర్షం వ్యక్తం చేసిన కాశీ విశ్వనాథ్‌ ట్రస్టు వారం రోజుల్లో జ్ఞానవాపీ మసీద్ ప్రాంగణంలోని విగ్రహాలకు పూజలు ప్రారంభిమస్తామని పేర్కోంది. జ్ఞానవాపీ మసీదును హిందూ దేవాలయం కూల్చి ఆ శిధిలాల మీద నిర్మించారని, మసీద్‌లోని ఫౌంటేన్‌లో ఉన్నది శివలింగమని, మసీదు నిర్మాణానికి ఉపయోగించిన స్తంభాలలో గుడి స్తంభాలు ఉన్నాయని, మసీద్ లోపల, ప్రాంగణంలో దేవతామూర్తుల విగ్రహాలున్నాయని హిందూవులు వాదిస్తున్నారు.


దీనిపై కోర్టులు ఆర్కియాలాజీ, కార్బన్ సర్వేలకు గతంలో ఆదేశించగా, సర్వే సంస్థలు నివేదికలు సమర్పించాయి. ఈ కేసు విచారణలో బుధవారం వారణాసీ హైకోర్టు మసీద్ ప్రాంగణంలోని విగ్రహాలకు పూజలకు అనమతిస్తూ ఇచ్చిన ఆదేశాలు హిందూవుల అతి పెద్ద విజయంగా కాశీ విశ్వనాథ్ ట్రస్టు అభివర్ణించింది. ఇటీవల సర్వేలో భాగంగా జరిపిన త్రవ్వకాల్లో విష్ణూమూర్తి, హనుమంతుడి విగ్రహాలు బయటపడ్డాయి. అలాగే ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో 55విగ్రహాలు, పలు భాషాల శాసనాలు లభించాయి. 17వ శతాబ్దంలో అక్కడ ఆదివిశ్వేశ్వరుడి ఆలయాన్ని కూల్చీ మసీద్ నిర్మించారని, గోడలపై అచ్చులు, గోడల్లో పలుచోట్ల వాడిన స్తంభాలు కూల్చిన గుడివేనని, ఏఎస్‌ఐ పేర్కోంది.

Latest News