Gyanvapi | జ్ఞాన‌వాపి మసీదులో.. ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే ప్రారంభం

Gyanvapi ఇరుప‌క్షాల స‌మ‌క్షంలో మొద‌లైన ప‌నులు విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వారణాసిలోని జ్ఞాన‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ ఐ) బృందం తన శాస్త్రీయ సర్వే పనిని పునఃప్రారంభించింది. 17వ శతాబ్దపు మసీదు హిందూ దేవాలయం ఎప్పుడు నిర్మించారో తెలుసుకోవడానికి ఏఎస్ఐ శ‌నివారం మసీదులో స‌ర్వేను మొద‌లుపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు శుక్ర‌వారం జ్ఞాన‌వాపి మసీదులో ఏఎస్ఐ బృందం స‌ర్వే ప‌నులు ప్రారంభించింది. దాదాపు 41 మంది సభ్యుల బృందం జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోని సీల్డ్ ప్రాంతాన్ని మినహాయించి, […]

  • Publish Date - August 5, 2023 / 12:46 AM IST

Gyanvapi

  • ఇరుప‌క్షాల స‌మ‌క్షంలో మొద‌లైన ప‌నులు

విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వారణాసిలోని జ్ఞాన‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ ఐ) బృందం తన శాస్త్రీయ సర్వే పనిని పునఃప్రారంభించింది. 17వ శతాబ్దపు మసీదు హిందూ దేవాలయం ఎప్పుడు నిర్మించారో తెలుసుకోవడానికి ఏఎస్ఐ శ‌నివారం మసీదులో స‌ర్వేను మొద‌లుపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు శుక్ర‌వారం జ్ఞాన‌వాపి మసీదులో ఏఎస్ఐ బృందం స‌ర్వే ప‌నులు ప్రారంభించింది.

దాదాపు 41 మంది సభ్యుల బృందం జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లోని సీల్డ్ ప్రాంతాన్ని మినహాయించి, బారికేడ్ ప్రాంతం కొలత, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీని నిర్వహించింది. ఆధారాలు సేకరించి పేపర్ షీట్ పై మ్యాప్ సిద్ధం చేసింది. పిల్లర్లను కూడా పరిశీలించింది. ప్రభుత్వ న్యాయవాది రాజేష్ మిశ్రా, ఇంతేజామియా మసాజిద్ కమిటీ న్యాయవాదుల స‌మ‌క్షంలో ఈ స‌ర్వే ప‌నులు జ‌రిగాయి.

“రెండో రోజు శ‌నివారం ఉదయం 9 గంటలకు సర్వే తిరిగి ప్రారంభ‌మైంది. ప్రజలు సర్వేకు సహకరించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కోరుతున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు సమస్యను త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం”అని హిందూ వాదుల తరపు న్యాయవాది సుధీర్ త్రిపాఠి తెలిపారు.

Latest News