Site icon vidhaatha

Viral Video | ఈ రంగులో పెద్ద పులిని ఎప్పుడూ చూసి ఉండ‌రు..!

Viral Video | పెద్ద పులులు గంభీరంగా ఉండి.. లేత బంగారు వ‌ర్ణంలో మెరిసిపోతుంటాయి. పులుల చ‌ర్మంపై న‌లుపు రంగు చార‌లు ఉంటాయి. కానీ ఈ పెద్ద పులి మాత్రం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఎందుకంటే ఈ రంగులో మీరు ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద పులిని చూసి ఉండ‌రు. శ‌రీరమంతా న‌లుపు రంగులో ఉన్న పెద్ద పులి ఒడిశాలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

ఈ పెద్ద పులి ఒడిశాలోని సిమిలిపాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో ఉన్న‌ట్లు ఇండియన్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ర‌మేశ్ పాండే త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆ టైగ‌ర్‌కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు.

ఈ రంగులో ఉండే పెద్ద పులిని మెల‌నిస్టిక్ టైగ‌ర్ అని పిలుస్తారు. సిమిలిపాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో ఈ మెల‌నిస్టిక్ టైగ‌ర్ కెమెరా కంటికి చిక్కింద‌ని పేర్కొన్నారు.

జెనిటిక్ మ్యూటేష‌న్స్ కార‌ణంగానే ఈ మాదిరి పులులు క‌నిపిస్తాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఈ పెద్ద పులి వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుంది.

Exit mobile version