Site icon vidhaatha

Viral Video | పులి వ‌ర్సెస్ కుక్క‌.. గెలిచిందెవ‌రో తెలుసా..?

Viral Video | అడ‌విలో అనేక రకాల జంత‌వులు ఉంటాయి. ఆహారం కోసం సంచ‌రిస్తూనే ఉంటాయి. ఇక సింహాలు, పులులు అయితే ఇత‌ర జంతువుల‌ను వేటాడి తింటాయి. ఆ రెండింటిని చూస్తే మిగ‌తా జంతువులు పారిపోతాయి.

అయితే పెద్ద పులి ఓ చెట్టు కింద నిద్రిస్తోంది. అటుగా వ‌చ్చిన ఓ కుక్క‌.. నిద్రిస్తున్న పులిని గ‌మ‌నించింది. పులి నిద్ర‌లో ఉంది క‌దా అని.. దానికి రెండు అడుగుల దూరంలో న‌డుచుకుంటూ వెళ్లింది. ఒక్క‌సారిగా పులి పంజా విసిరింది. పులి గాండ్రిపులు చేసే స‌రికి కుక్క కూడా అదే స్థాయిలో మొరుగుతూ.. దాడికి ప్ర‌య‌త్నించింది. కానీ పులి చేతిలో కుక్క చిక్కిపోయింది.

కుక్క గొంతును పట్టేసిన పెద్ద పులి.. దాన్ని అడ‌విలోకి తీసుకెళ్లింది. ఈ దృశ్యాన్ని ల‌ఖాన్ రాణా అనే వ్య‌క్తి చిత్రీక‌రించ‌గా, ఐఆర్ఎస్ అధికారి అంకుర్ రాప్రియ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఈ దృశ్యం రాజ‌స్థాన్‌లోని ర‌త్నంబోర్ నేష‌న‌ల్ పార్కులో క‌నిపించింద‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Exit mobile version