Site icon vidhaatha

Viral Video | ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా రాని అంబులెన్స్‌.. తోపుడు బండిపై తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు..!

Viral Video | అనారోగ్యానికి గురైన తండ్రిని కాపాడుకునేందుకు ఓ బాలుడు తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అంబులెన్స్‌ రాకపోవడంతో చివరకు విసిగిపోయి తోపుడు బండిపై ఎక్కించుకొని తోసుకుంటూ వెళ్తున్న వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలోని కొత్వాలి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది.. వివరాల్లోకి వెళితే.. బలియారి ప్రాంతంలో నివసిస్తున్న షా వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత భార్య, అతని కొడుకు 108కు ఫోన్‌ చేశారు.

ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా అంబులెన్స్‌ రాలేదు. దాదాపు అరగంట వరకు నిరీక్షించినా రాకపోవడంతో.. చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో తండ్రిని కాపాడుకునేందుకు అతని ఆరేళ్ల కొడుకు తల్లి సహాయంతో తోడుపు బండిపై పడుకోబెడ్డుకొని మూడునాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.

అయితే, హృదయవిదారకమైన ఘటనను ఎవరో సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. వీడియో వైరల్‌గా మారడంతో జిల్లా యంత్రాంగం ఘటనపై విచారణకు ఆదేశించింది. విచారణ బాధ్యతలను ఏడీఎంకు అప్పగించగా.. ఏడీఎం డీపీ వర్మన్‌ దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version